ఇద్దరి దారిలో బోయపాటి నడుస్తాడా... జాగ్రత్త పడకుంటే కష్టాలు తప్పవోయ్‌ బోయపాటి

ఒకప్పుడు యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు బి గోపాల్‌.చిరంజీవి, బాలకృష్ణలతో అప్పట్లో అదిరిపోయే యాక్షన్‌ సినిమాలను తీసి మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు.

 Boyapati Sreenu Following These Two Directors-TeluguStop.com

అద్బుతమైన టేకింగ్స్‌తో బి గోపాల్‌ మాస్‌ పల్స్‌ను తెలుసుకుని సినిమాలను తెరకెక్కించేవాడు.అయితే ఆయన ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు.

ఎందుకంటే ఆయన సినిమాలు కొన్నాళ్లకే ప్రేక్షకులకు బోర్‌ కొట్టాయి.ఆ తర్వాత వినాయక్‌ ఆది చిత్రంతో అబ్బ అనిపించాడు.ఆ తర్వాత మంచి యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌తో సినిమాలను తీశాడు.వినాయక్‌ కూడా కొంత కాలానికే వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడ్డాడు.ఆయన మూస సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.దాంతో ఇప్పుడు వినాయక్‌ కు అసలు ఆఫర్లే కరువయ్యాయి.

వినాయక్‌ తర్వాత అంతటి యాక్షన్‌ చిత్రాలను, అంతకు మించి యాక్షన్‌ చిత్రాలను తీసిన దర్శకుడు బోయపాటి శ్రీను.ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మాస్‌ను అలరించాయి.అయితే మాస్‌ దర్శకులకు లైఫ్‌ స్పామ్‌ చాలా తక్కువ అని బోయపాటి విషయంలో కూడా నిరూపితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే బోయపాటి శ్రీను తాజాగా వినయ విధేయ రామ చిత్రంను తెరకెక్కించాడు.

గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా బోయపాటి భారీ మాస్‌ ఎలిమెంట్స్‌ను పెట్టాడు.కాని ప్రేక్షకులు ఈసారి తిరష్కరించారు.అబ్బే ఇదేం మాస్‌ సినిమా అంటూ పెదవి విరుస్తున్నారు.

వినయ విధేయ రామ చరణ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్స్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.మంచి ఓపెనింగ్స్‌ అయితే రాబట్టిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో చేతులెత్తేసింది.దానికి తోడు సోషల్‌ మీడియాలో ఈ చిత్రంపై వచ్చిన కామెంట్స్‌ అన్నీ ఇన్నీ కావు.

బోయపాటి పరువు గంగలో కలిసి పోయినంత పనైంది.బోయపాటితో సినిమా అంటే హీరోలు బాబోయ్‌ అనే స్థాయిలో సోషల్‌ మీడియాలో బోయపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఇప్పట్లో బోయపాటి సినిమా మొదలయ్యే అవకాశాలే కనిపించడం లేదు.దాంతో వినాయక్‌, గోపాల్‌ గారి దారిలోనే బోయపాటి కూడా ఇక కనుమరుగవ్వనున్నాడా అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube