లెజెండ్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి  

Boyapati Sreenu Continues Legend Sentiment, Balakrishna, Boyapati Sreenu, Legend, BB3, Monarch - Telugu Balakrishna, Bb3, Boyapati Sreenu, Legend, Monarch

మాస్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను, తనదైన మార్క్ చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.ఇప్పటికే తన కరీర్‌లో పలు బ్లాక్‌బస్టర్ హిట్‌లు అందించిన బోయపాటి, అట్టర్ ఫ్లాప్ సినిమాలను సైతం స్టార్ హీరోలకు అంటగట్టాడు.

 Boyapati Sreenu Continues Legend Sentiment

గతేడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాను తెరకెక్కించి అభాసుపాలయ్యాడు.

ఇప్పుడు తనకు ఎంతో కలిసొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.

లెజెండ్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బోయపాటి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే షూటింగ్ పనులు మొదలుపెట్టుకున్న ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న బోయపాటి, గతంలో బాలయ్యతో తెరకెక్కించిన లెజెండ్ సినిమాలోని ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.లెజెండ్ సినిమాలో బాలయ్యకు ఓ కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేయించి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

కాగా ఇప్పుడు కూడా ఇదే తరహాలో బాలయ్యతో చేస్తున్న సినిమాలో టాలీవుడ్‌కు పరిచయం లేని ఓ హీరోయిన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆమె బాలయ్య సరసన పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని బోయపాటి ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలో నటిస్తుండగా, అందులో అఘోరా పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ అంటోంది.మరో పాత్రలో బాలయ్య పవర్‌ఫుల్ రైతుగా మనల్ని అలరించనున్నాడు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

#Monarch #Balakrishna #Boyapati Sreenu #Legend #BB3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Boyapati Sreenu Continues Legend Sentiment Related Telugu News,Photos/Pics,Images..