మరో అప్డేట్ ఇచ్చిన బోయపాటి.. షూటింగ్ కోసం డేట్ లాక్.. ఎప్పుడంటే!

దసరా రోజు అదిరిపోయే సర్ప్రైజ్ లతో బోయపాటి శ్రీను ప్రేక్షకులకు సంతోషం పంచుతున్నారు.పండుగ సందర్భంగా తన నెక్స్ట్ సినిమా నుండి ఈ రోజు వరుస అప్డేట్ లు అనౌన్స్ చేస్తున్నారు.

 Boyapati-ram's Film To Roll From Tomorrow , Sreeleela, Dussehra, Boyapati Srinu-TeluguStop.com

దీంతో అంతా ఫుల్ సర్ప్రైజ్ అవుతున్నారు.ఈ రోజు ఉదయమే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి అప్డేట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

ఇక ఇప్పుడు వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసేది రేపే అని చెప్పి మరింత సర్ప్రైజ్ చేసాడు.

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ‘RAPO20’.

ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జోష్ గా సిద్ధం అవుతున్నాడు.రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.

అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.

ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.

ఇక ఈ సినిమా నుండి దసరా కానుకగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా హీరోయిన్ ను ఫిక్స్ చేసారు.

పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో భాగం కానుంది అంటూ పోస్టర్ ద్వారా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.ఇక ఇప్పుడు షూటింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు.

మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ ను రేపటి నుండి స్టార్ట్ చేయబోతున్నాం అని తెలిపాడు బోయపాటి.రామోజీ ఫిలిం సిటీలో రేపటి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారు.ముందుగానే యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube