ఆ రెండు ప్రకటించాలంటే మంచి ముహూర్తం కావాలి అంటున్న బోయపాటి

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి లెజెండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధం అయ్యింది.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేలోపే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.

 Boyapati Gives Clarity On Rumors, Tollywood, Telugu Cinema, South Cinema, Balakr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో కూడా బాలకృష్ణ గత రెండు సినిమాల తరహాలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇది కూడా బోయపాటి స్టైల్ లో నడిచే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్, హీరోయిన్స్ విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి.సినిమాలో హీరోయిన్ గా అమలాపాల్ ని ఫైనల్ చేసారని చర్చ నడిచింది.

అలాగే సినిమాకి సూపర్ మ్యాన్ అనే హాలీవుడ్ టైటిల్ ని ఫైనల్ చేశారని ప్రచారంలోకి వచ్చింది.

తాజాగా బోయపాటి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

అందరూ ప్రచారం చేస్తున్నట్లు టైటిల్, హీరోయిన్ వార్తలు వాస్తవం కాదని తేల్చేశాడు.అయితే ఇప్పటికే ఈ సినిమాకి ఒక మంచి టైటిల్ తో పాటు, హీరోయిన్ ని కూడా ఫైనల్ చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం కరోనా సిచువేషన్ వలన వాటిని ప్రకటించే ఆలోచన లేదని చెప్పాడు.

సినిమాకి సంబందించిన టైటిల్, క్యాస్టింగ్ విషయంలో మంచి ముహూర్తం చూసుకొని ప్రకటన చేస్తానని చెప్పాడు.దానికి మరికొంత సమయం పట్టొచ్చు అని కూడా తెలియజేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube