నేను మోనార్క్ ని అంటున్న బాలకృష్ణ… బోయపాటి స్టైల్ టైటిల్  

Boyapati Balakrishna Monark - Telugu Boyapati -balakrishna Movie Title Monark, Nandamuri, South Cinema, Telugu Cinema, Tollywood

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కూడా బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

 Boyapati Balakrishna Monark

ఓ పాత్రలో ఇప్పటి వరకు కనిపించని విధంగా బాలకృష్ణ అఘోరా గెటప్ లో కనిపించనున్నాడు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కథ ఫాంటసీ ఎలిమెంట్ తో ఉంటుందని తెలుస్తుంది.

అలాగే బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాల మాదిరిగానే హై ఒల్టేజ్ యాక్షన్ నేపధ్యంలోనే ఉంటుందని సమాచారం.ఇక ఇందులో బాలయ్యకి జోడీగా ఓ కొత్త భామని బోయపాటి పరిచయం చేయబోతున్నాడు.

నేను మోనార్క్ ని అంటున్న బాలకృష్ణ… బోయపాటి స్టైల్ టైటిల్-Movie-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.ఈ సినిమా షూటింగ్ కి బోయపాటి అంతా సిద్ధం చేశాడు.ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.

ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజండ్ సినిమాల తరహాలోనే పవర్ ఫుల్ గా ఉండాలంటే, అది కూడా కథకి యాప్ట్ అయ్యే విధంగా ఉండాలని ఈ మోనార్క్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే బాలయ్య పుట్టినరోజు వరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test