రామ్ ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడా?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.బోయపాటి అంటేనే యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఒక అవగాహనకు వచ్చేసారు.

 Boyapati And Ram Pothineni Rapo20 Latest Update Details, Boyapati Srinu, Ram Pothineni, Rapo20,boyapati And Ram Pothineni-TeluguStop.com

అంతలా ఈయన తన సినిమాల్లో యాక్షన్ ను రుచి చూపిస్తూ ఉంటాడు.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

 Boyapati And Ram Pothineni RAPO20 Latest Update Details, Boyapati Srinu, Ram Pothineni, RAPO20,Boyapati And Ram Pothineni-రామ్ ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.రామ్ అయితే తన ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడు.

ఎందుకంటే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్‘ సినిమా విజయం సాధించలేదు.మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా భారీ హిట్ అయితే నమోదు చేయలేదు.

పైగా ఈ సినిమాతో రామ్ తమిళ్ ఎంట్రీ ఇచ్చాడు.వారియర్ తో అక్కడ కూడా పాగా వేయాలని చూసినా ఆయన అనుకున్నది జరగక పోవడంతో నిరాశలో ఉన్నాడు.

Telugu Rapo, Boyapatiram, Boyapati Srinu, Ram Pothineni, Rapo Story Line, Srinivasasilver-Latest News - Telugu

కనీసం ఇప్పుడు బోయపాటి అయినా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అని అనిపిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube