స్కంద ఫ్లాపైనా భారీగా రెమ్యునరేషన్ పెంచిన బోయపాటి.. పారితోషికం ఎంతంటే?

టాలీవుడ్ నందమూరి నరసింహం బాలకృష్ణ(Balakrishna) అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను(boyapati srinu) కాంబినేషన్లో ఇప్పటికే సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.

వీరి కాంబోలో వచ్చిన ప్రతి ఒక్క మూవీ కూడా మంచి సక్సెస్ను సాధించాయి.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా లెజెండ్ అఖండ వంటి సినిమాలు విడుదలై మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే.ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య బాబు బోయపాటి శ్రీను.

ఇకపోతే గతంలో విడుదలైన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2(akhanda 2) సినిమాను ఇటీవల మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బోయపాటి అఖండ 2 (boyapati srinu, akhanda)సినిమా కోసం రెడీ అవుతున్నారు.ఇక మరోవైపు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత బాలయ్య బాబు అఖండ 2 సినిమా షూటింగ్లో పాల్గొన బోతున్నారు.

Advertisement

మొదటి సారి బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేసే కంటెంట్ తో వ‌స్తున్నారు.అఖండకు అనూహ్యాంగా హిందీ ఛానెల్స్ లో ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే.

అందుకే అఖండ‌ 2ని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేస్తున్నారు.తాజాగా ఈ క్రేజ్ ని బోయ‌పాటి ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాకి బోయ‌పాటి తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.ఏకంగా రూ.22 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు బోయపాటి అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే అని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఏ సినిమాకు కూడా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోలేదు.ఇప్పటి వరకు ఆయన మ‌హా అయితే 10 కోట్ల వ‌ర‌కూ అందుకున్నారు.

దిండు కింద దాక్కున్న పెద్ద కోబ్రా.. వీడియో చూస్తే అదిరిపడతారు..!
అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?

కానీ ఈ సినిమాతో రెట్టింపు ఛార్జ్ చేస్తున్నారు.ఈ సినిమాకు బాల‌య్య కుమార్తె తేజ‌స్వీని(Balayya daughter Tejaswini) సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

రామ్ అచంట‌-గోపీ అచంట(Ram Achanta-Gopi Achanta) నిర్మిస్తున్నారు.వాస్తవానికి అంఖడ హ‌క్కులు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి.

సెకండ్ పార్ట్ కూడా ఆయ‌నే నిర్మించాలి.కానీ ఆయ‌న స్థానంలో కొత్త నిర్మాత‌లు క‌నిపిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్ తో వస్తున్నారు.సినిమాకు ఫ‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్లు తీసుకుంటున్నారు.

తమ‌న్ ని య‌థావిధిగా సంగీత దర్శకుడిగా కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు