‘పబ్‌జీ’కి రూ.16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు..!?  

pubg player in punjab lost rs 16 lakh from parents bank accounts,Pub g, Player, 16 lakhs, Bank account - Telugu 16 Lakhs, Bank Account, Player, Pub G, Pubg Player In Punjab Lost Rs 16 Lakh From Parents Bank Accounts

పబ్ ‌జీ.ఈ గేమ్ వల్ల ఎంతమంది జీవితం నాశనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Boy Uses 16 Lakhs For Pub G

ఇప్పటికే చైనా యాప్ టిక్ టాక్ కారణంగా ఎంతోమంది యువత జీవితం నాశనం అయ్యింది.ఇంకా ఈ పబ్ జి పీడ మాత్రం ఇప్పటి వరకు వొదల్లేదు అంటే నమ్మండి.

ఇంకా ఇప్పుడు ఈ పబ్ ‌జీ కారణంగా ఎవరి ప్రాణం పోలేదు కానీ ఒక కొడుకు చేసిన పని తట్టుకోలేక ఆ తండ్రి చేసిన పని ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ఏకంగా రూ.16 లక్షలు హాంఫట్ చేశాడు.ఇంకా ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది.

పబ్‌జీ’కి రూ.16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు ఏమైందంటే ? ఆన్‌లైన్ క్లాసులు చూస్తానంటూ తండ్రి వద్ద ఫోన్ తీసుకున్న ఆ యువకుడు అందులో పబ్‌జీ గేమ్ ఆడటం ప్రారంభించాడు.

ఇంకా ఈ నేపథ్యంలో ఆ పబ్ జి అందులో గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేందుకు, ‘ఇన్-యాప్’ అప్‌డేట్ కోసం మొబైల్‌లోని తండ్రి అకౌంట్‌ను వాడేసేవాడు.

అయితే అతను ఆ ఫోన్ నుండి మొబైల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు నిర్వహిస్తాడనే విషయం అతడికి తెలుసు.ఇంకేముందు ఎవరికి తెలియకుండా పబ్‌జీకి డబ్బులు చెల్లిస్తూ.

పేమెంట్ మెసేజులను ఫోన్ నుంచి డిలీట్ చేసేవాడు.

అయితే అతని అకౌంట్లో నుండి డబ్బులు కట్ అవుతాయి అనేది అతనికి తెలియలేదు.

అయితే ఓ రోజు తండ్రి అకౌంట్ చెక్ చేసుకోగా అందులో డబ్బులు తక్కువ కనిపించాయి.ఇంకా అనుమానం వచ్చి కొడుకును ప్రశ్నించగా పబ్‌జీ కోసం ఖర్చు చేసినట్టు సమాధానం చెప్పాడు.

ఈ విషయం విన్న అతని తండ్రికి ఏం చెయ్యాలో తెలియలేదు.

వైద్యఖర్చుల కోసం దాచుకున్న మొత్తం 16 లక్షల రూపాయిలను పబ్‌జీ కోసం ఖర్చు చేశాడు.

ఆ డబ్బు ఇప్పట్లో వెనక్కి రాదు అని తెలిసి కొడుకుకు తగిన బుద్ధి చెప్పాడు.కొడుకును బైక్ మెకానిక్ షాపులో పనికి పెట్టాడు.ఇంకా ఈ విషయంపై అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.”ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పబ్‌జీ కోసం ఖర్చు చేశాడు.డబ్బు సంపాదన ఎంత కష్టమో తెలిసేందుకే నా కొడుకును మెకానిక్ షాపులో పనికి పెట్టాను.ఇకపై అతడికి ఫోన్ కూడా ఇవ్వబోను” అని తెలిపాడు.ఏది ఏమైనా పబ్ జి టూ డేంజరస్ బాబు.

#Player #Pub G #16 Lakhs #Bank Account

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Boy Uses 16 Lakhs For Pub G Related Telugu News,Photos/Pics,Images..