బాత్ రూమ్ లో స్నానం కామన్...అందుకే సింక్ లో స్నానం చేశాడు  

Boy Taking Bath In The Kitchen Sink ...video Viral-telugu Viral News,viral In Social Media,వెరైటీ,సింక్ లో స్నానం

బాత్ రూమ్ లో స్నానం చేయడం కామన్,కానీ సింక్ లో స్నానం చేయడం వెరైటీ. మరి ఇలా చేస్తే వెరైటీ గా ఉంటుంది అని చేశాడో లేదా మరేదైనా కారణం ఉందొ తెలియదు కానీ ఫ్లోరిడా కు చెందిన ఒక వ్యక్తి ఇలా వెరైటీగా సింక్ లో స్నానం చేశాడు. సింక్ అంటే ఎదో ఇంట్లో ఉండే సింక్ కాదులేండీ..

బాత్ రూమ్ లో స్నానం కామన్...అందుకే సింక్ లో స్నానం చేశాడు-Boy Taking Bath In The Kitchen Sink ...Video Viral

రెస్టారెంట్ కిచెన్ లో ఉండే పెద్ద సింక్ లో అయ్యగారు స్నానం చేశారు.

వాస్తవానికి అతడు అదే రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఏమైందో ఏమో గానీ స్నానం చేయాలనీ భావించిన అతడు ఆ రెస్టారెంట్ లోని కిచెన్ సింక్ లో టబ్ బాత్ చేసిన రేంజ్ లో స్నానం చేశాడు.

అయితే అతగాడు స్నానం చేసిన తతంగం మొత్తం కెమెరా లో రికార్డ్ చేసి వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో ను హేలీ లీక్ అనే మహిళా తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

బాత్ లో మునిగిపోయిన అతగాడికి తోలి వర్కర్స్ కూడా సాయం అందించారట. తోటి మహిళా ఉద్యోగులను టవల్ అడిగితె వారంతా కూడా చేతి రుమాళ్లు తెచ్చి ఇవ్వడం తో ఇంకా వైరైటీ గా అతడి స్నానము తతంగం ముగిసింది.

అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడం తో నెటిజన్లు అందరూ కూడా ఇలా కూడా స్నానం చేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొన్ననే నూడిల్స్ తో సింక్ రిపేర్ చేయడం చూశారు, ఇప్పుడు ఏకంగా సింక్ లోనే స్నానం చేయడం కూడా చూస్తూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.