దేవుడా.. పబ్ జీ దెబ్బకి కుటుంబం బలి..!

ఆన్లైన్ గేమ్స్ కి బానిసైన కొందరు.ఫోన్ ఇవ్వడం లేదని ప్రాణాలు తీసుకుంటుంటే, మరికొందరు ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు.

 Boy Shoots Entire Family In Pakistan Under Pubg Influence Details, Pubg, Game, Adicted, Online Games, Latest News, Boy Shoots, Entire Family ,pakistan ,pubg Influence, Taimur, Online Games-TeluguStop.com

అలా కొన్ని ఆన్లైన్ గేమ్స్ పిల్లలకు వ్యసనంగా కూడా మారాయి.అలా పబ్జీ కి బానిసైన ఓ బాలుడు ఏకంగా తల్లిని, ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు.

ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.

 Boy Shoots Entire Family In Pakistan Under Pubg Influence Details, Pubg, Game, Adicted, Online Games, Latest News, Boy Shoots, Entire Family ,pakistan ,pubg Influence, Taimur, Online Games-దేవుడా.. పబ్ జీ దెబ్బకి కుటుంబం బలి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే.

పాకిస్థాన్ లోని లాహోర్ లో కహ్నాలో నహిద్ ముబారక్ (45) కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి.తన పిల్లలతో కలిసి ఉంటోంది.

ఆమెకు తైమూర్ (22), అలాగే ఆమె ఇద్దరు కూతుళ్లతో పాటు.మరో మైనర్ బాలుడు ఉన్నారు.

అయితే, చిన్న కొడుకు (14) పబ్‌జీ ఆటకు బానిసయ్యాడు.ఫలితంగా మానసిక సమస్యలు కూడా అతడిని చుట్టుముట్టాయి.

పబ్‌‌జీ ఆటలో పడి చదువును పక్కనపెట్టేయడంతో తల్లి నహీద్ ముబారక్ మందలించింది.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడు ఇంట్లో ఉన్న తుపాకితో తల్లి, నిద్రిస్తున్న సోదరుడు తైమూర్, అక్కాచెల్లెళ్లను కాల్చి చంపాడు.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను ఎవరో కాల్చిచంపారంటూ.పొరిగింటి వారికి చెప్పాడు.ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నాడు.మొదట తనకేమీ తెలియదని, ఈ ఘటన జరిగినప్పుడు తాను మేడపై ఉన్నానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు ఆ బాలుడు.

అయితే, పోలీసుల దర్యాప్తులో బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది.నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పబ్జీ గేమ్ కి బానిసలై ఎందరో ప్రాణాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.కాగా, పబ్జీ గేమ్ ను ఇండియాలో నిషేదించారు.

Boy Shoots Entire Family In Pakistan Under Pubg Influence Details, Pubg, Game, Adicted, Online Games, Latest News, Boy Shoots, Entire Family ,pakistan ,pubg Influence, Taimur, Online Games - Telugu Boy Shoots, Entire, Game, Latest, Games, Pakistan, Pubg, Pubg Influence, Taimur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube