బుడ్డోడి మాటలకు షాకైన సింగర్ సునీత.. ఏమైందంటే..?

ఈ ఏడాది సింగర్ సునీత పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించడం ద్వారా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న సునీతకు హీరోయిన్ ఆఫర్లు కూడా రాగా ఆమె మాత్రం ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసి సింగర్ గానే కొనసాగుతున్నారు.

 Boy Shocks Singer Sunitha In Drama Juniors Show, Boy Shocks , Drama Juniors, Ma-TeluguStop.com

ఒకవైపు పాటలు పాడుతూ మరోవైపు డబ్బింగ్ చెబుతూ వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

సునీతకు ముందు, సునీత తర్వాత చాలామంది సింగర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా సునీతలా ఆ సింగర్లు పేరును సంపాదించుకోలేకపోయారు.

తన సినీ కెరీర్ లో సింగర్ గా సునీత కొన్ని వేల పాటలను పాడటం గమనార్హం.సునీత పాడిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఈ మధ్య కాలంలో సునీత బుల్లితెరపై కూడా సందడి చేస్తుండటం గమనార్హం.

అయితే తాజాగా ఓ బుడ్డోడు తన మాటలతో సునీతకు షాకిచ్చారు.

Telugu Boy, Drama Juniors, Sunitha-Movie

జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోకు సునీత జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.వచ్చే వారానికి సంబంధించిన డ్రామా జూనియర్స్ ప్రోమో తాజాగా రిలీజైంది.ఈ ప్రోమోలో ఒక బుడ్డోడు మన్మథుడు సినిమా స్పూఫ్ చేసి కడుపుబ్బా నవ్వించాడు.

స్పూఫ్ చేసిన బుడ్డోడిని సునీత నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటావని అడిగారు.

Telugu Boy, Drama Juniors, Sunitha-Movie

అయితే ఆ బుడ్డోడు సునీతకు మీలానే ఉండాలని బదులిచ్చారు.ఆ బుడ్డోడి మాటలు విని షోలో పాల్గొన్న వాళ్లంతా అవాక్కయ్యారు.ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ఈ షో ప్రసారం కానుంది.

డ్రామా జూనియర్స్ షోలో చిన్నపిల్లలు చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube