ఇలాంటి హత్యాచార ఘటన ఎక్కడా విని ఉండరు..       2018-04-25   05:41:47  IST  Raghu V

వరుస హత్యచార ఘటనలు నమోదవుతున్న నేపధ్యంలో మరో పక్క ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకు పడుతున్న సమయంలో కేంద్రం ఈ ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షను విధించేలా కేంద్రం పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టానికి సవరణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ చట్టం చేసి కొన్ని రోజులు కూడా గడవక ముందే ఓ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.


ఉత్తరప్రదేశ్‌లో ఓ మైనర్‌ తన తల్లిదండ్రులు, సోదరి ఎదుటే బాలిక(13)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దెహాత్‌ జిల్లాలో ఆదివారం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివలీ ప్రాంతంలో నివాసముండే 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులు, సోదరి మద్ధతుతో ఆదివారం 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు…కుటుంభ సభ్యులే ఈ ఘటనకి ప్రోత్సాహం ఇవ్వడంతో ఈ విషయం తెలిసిన వాళ్ళు నివ్వెర పోయారు..ఆ మైనర్ బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసించాడనీ.. లైంగిక దాడి గురించి బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు.


ఈ దారుణం అనంతరం ఇంటికి వెళ్ళిన ఆ బాలిక జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ముందుగా జి​ల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు..అయితే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో ఆమెని అక్కడి నుంచీ లాలా లజపతిరాయ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలుడిపై కేసు నమోదు చేసి అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని డీఐజీ చెప్పారు.