నీట్ కు పర్మిషన్ కావాలంటూ కోర్టును కోరిన యువ ఉగ్రవాది

పుల్వామా ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదుల కోసం పేలుడు పదార్థాలు, ఆయుధాలను సంపాదించడానికి సహాయం చేసిన కాశ్మీరీ యువకుడు,యువ ఉగ్రవాది నీట్ పరీక్షకు హాజరుకావడానికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్ధించినట్లు తెలుస్తుంది.ఈనెల 13 న జరగబోయే నీట్ పరీక్షకు హాజరుకావడానికి జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి కోరినట్లు సమాచారం.40 మంది సిఆర్‌పిఎఫ్ సైనికుల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించి 20 ఏళ్ల వైజ్ ఉల్ ఇస్లాంను ఎన్‌ఐఏ తన చార్జిషీట్‌లో నిందితుడిగా పేర్కొనడంతో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలను సేకరించడంలో మరియు ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో ఆ యువకుడు కీలక పాత్ర పోషించినట్లు ఎన్ ఐ ఏ అధికారులు చెబుతున్నారు.

 Youth Who Helped Jaish Men In Pulwama Attack Seeks Permission To Take Neet Exam,-TeluguStop.com

ఒక అధికారి మాట్లాడుతూ….నిందితుడు శ్రీనగర్‌ను తన పరీక్షా కేంద్రంగా ఎన్నుకున్నాడని,అక్కడ అతను పోటీ పరీక్ష కోసం ఇతర విద్యార్థులతో హాజరుకావాల్సి ఉంటుంది అని, ఈ క్రమంలో ఊహించని శాంతిభద్రతల పరిస్థితి ఏర్పడవచ్చు అని లేదంటే అక్కడ నుంచి ఆ యువకుడు తప్పించుకునేందుకు ప్రయత్నించే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

మరి ఈ క్రమంలో అతడి అభ్యర్ధనను కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube