10 సం.ల వయస్సున్న ఈ బాలుడు ఏం చేసాడో చూస్తే ఔరా అనిపించక మానదు!!

పిట్ట కొంచెం కూత ఘనం అన్నది ఒక సామెత.కానీ 10 ఏళ్ళ ఈ బుడతడు చేసిన పని చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు.

 Boy Letter To Qantas For Advice On How To Set Up An Airline-TeluguStop.com

వివరాలలోకి వెళితే అలెక్స్ జాక్వోట్ అనే 10 సంవత్సరముల బాలుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటా విమానయాన సంస్త ముఖ్య కార్య నిర్వహణాధికారి (సి.ఇ.ఓ ) అలన్ జాయిస్ కి రాసిన ఒక వుత్తరం సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.అంత చిన్న వయస్సులో ఆ చిన్నారి కంటున్న కలలు మరియు లక్ష్యాలు అలన్ జాయిస్ ని అబ్బురపరచేలా చేశాయి.

అంతే కాదు ఆ చిన్నారితో వెటనే సమావేశాన్ని ఏర్పాటు చేసేలా చేశాయి.

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే , తను ‘ఓసియానా ఎక్స్ ప్రెస్స్’ అనే సొంత విమానయాన సంస్థను స్తాపించ బోతున్నానని , దానికి తానే సి.ఇ.ఓ.ని అని దానిని అభివృద్ధి చేయుటకు మీ సలహాలు కావాలని రాసాడు.అంతే కాదు దానిని విస్తరించుటకు, అభివృద్ధి పరచుటకు ప్రణాలికలు కూడా ఆ ఉత్తరంలో తెలియ పరచాడు.

దానికి సి.ఇ.ఓ తానేనని, ఒక సి.యఫ్.ఓని, ఒక ఐ.టి.హెడ్ ని, ఒక కార్య నిర్వహణాధికారిని, హెడ్ అఫ్ సర్వీసెస్ ని, న్యాయ సలహాదారుడిని నియమించు కొన్నానని తెలిపాడు.ఏ రకమైన విమానాలు అవసరం, ఎన్ని విమానాలు అవసరం, అందులో ఎటువంటి ఆహారాన్ని సరఫరా చేయాలి, ఎటువంటి సేవలు అందించాలి అనే దానిమీద తన వద్ద ప్రణాలికలు వున్నాయని తెలిపాడు.

అతను అలెన్ జాయిస్ ను ఇంకా కొత్తగా విమానయాన సంస్తను స్తాపించాలి అనుకొనే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటని అడిగాడు.

అతని ఉత్తరం చూసి ముగ్దుడు అయిన అలెన్, స్వయంగా తానే ఈవిధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు.సాధారణంగా తను, తన పోటిదారులు ఎవరికీ సలహాలు ఇవ్వననీ, కానీ జాక్వెస్ విషయంలో మినహాయిస్తునానని తెలిపాడు.కారణం తను కూడా చిన్న బాలుడుగా ఉన్నప్పుడు విమానాలు అన్నా, విమానయాన సంస్థ స్తాపించాలి అన్న ఆసక్తి ఎక్కువగా వుండేదని రాసాడు.

కానీ ఇది ఉత్తరంలో కుదరదని, నేరుగా సి.ఇ.ఓ.తో సి.ఇ.ఓ.కూర్చొని మాట్లాడు కొనేటప్పుడు వివరిస్తానని తెలిపాడు.

దీనికి సంభందించిన వివరాలు పొందుపరుస్తూ ట్విట్టర్లో అలెన్ జాయిస్ షేరు చేసిన మెస్సేజ్ కు మంచి స్పందన లభిస్తుంది.తను ఆబాలుడిని త్వరగా కలవాలనుకోతున్నట్లు అలెన్ తెలిపాడు.అలెక్స్ జాక్వోట్ తో సమావేశంకోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

వీరి మధ్య సంభాషణకు, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద కలలు కంటున్న పిల్లల తత్వానికి, నేట్టిజన్లు సంబ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.అలెన్ షేరు చేసిన కొద్ది గంటలలోనే 17000 ట్విట్లు మరియు 60000 రిట్విట్లు వచ్చాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు అందరికి వీరి సంభాషణ ఎంతగా నచ్చిందో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube