సోషల్ మీడియా( Social Media ) బాగా ప్రబలడంతో నిత్యం అనేక వీడియోలు ఇక్కడ వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు నెటిజన్లను చాలా ముచ్చటగొలిపేలా చేస్తుంటాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దానిని చూసిన నెటిజన్లు కామెంట్లతో ఆ బాలుడిని తెగ మెచ్చుకుంటున్నారు.
అవును, ఓ బాలుడు( Boy ) తన షాపును ( Shop ) కాపాడుకునేందుకు కనబరిచిన తపన విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలో తన కన్నతల్లికి( Mother ) ఆ బాలుడు చేసిన సాయాన్ని చూసి ముగ్దులైపోతున్నారు.
ఈ వీడియోను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.ఈ వీడియోని గమనిస్తే, ఒక చిన్న పిల్లవాడు తన తల్లికి సహాయం చేస్తున్న దృశ్యాలను స్పష్టంగా చూడవచ్చు.తుఫాను సమయంలో షాపును కాపాడటంలో బాలుడు తన తల్లికి చేస్తున్న సాయం ఇక్కడ కనిపిస్తుంది.గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో దాన్ని తీసుకువచ్చేందుకు బాలుడు పరిగెత్తడం ఇక్కడ గమనించవచ్చు.
వయసుకు మించిన బాధ్యతను చూపించి, పడిపోయిన కుర్చీని తిరిగి తీసుకొచ్చేందుకు పరుగెత్తాడు.
అంత చిన్న వయసులో బాలుడు తన బాధ్యతను గుర్తెరగడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.వయసు చిన్నగా ఉన్నా పరిస్ధితులు బాధ్యతలను నేర్పుతాయని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.బాలుడిని ట్విట్టర్ యూజర్లు ప్రశంసల్లో ముంచెత్తారు.
చిన్న వయసులోనే బాలుడు పరిపక్వతతో వ్యవహరించడం ముచ్చటేస్తోందని కొంతమంది యూజర్లు రాసుకొచ్చారు.ఇది స్ఫూర్తిదాయక వీడియో అని మరికొందరు యూజర్లు కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు.
ప్రతి దిగువ మధ్యతరగతి వ్యక్తికి ఇలాంటి బాధ్యతలు అర్ధం అవుతాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.