ప్రేమ కోసం అబ్బాయి ధర్నా, అమ్మాయి..!       2018-06-30   00:45:02  IST  Raghu V

సహజంగా అయితే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడు అంటూ అమ్మాయిలు ఆందోళనలు చేయడం మనం ఇప్పటి వరకు చూశాం. సమాజంలో ఎక్కువగా అమ్మాయిలు మోస పోవడం చూస్తూ ఉంటాం. ప్రతి రోజు మీడియాలో ఏదో ఒక చోట అమ్మాయిని అబ్బాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు అంటూ చదువుతూ ఉంటాం. కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న కథనంలో ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకునేందుకు పోరాటం చేస్తున్నాడు. కులాల పేరుతో తమ ప్రేమను విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అతడు ఆందోళనకు దిగుతున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా వ్పేూర్‌ మండలం పడగల్‌కు చెందిన ఒక యువకుడు అమ్మాయి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న తమను విడదీసి అమ్మాయికి వేరే పెళ్లి చేయబోతున్నారు అంటూ అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పది సంవత్సరాలుగా ఈ యువకుడికి ఆ అమ్మాయితో పరిచయం ఉందట. ఏడు ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేయడం జరిగిందట. ఇద్దరి సహజీవనంను వివాహంగా మ్చుకోవాలని అతడు భావించాడు.

ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులకు కులం పట్టింపు ఎక్కువ నీవు ఎస్సీ అవ్వడం వల్ల ఖచ్చితంగా మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే చనిపోతారు అంటూ ఆమె చెబుతూ వచ్చింది. తాజాగా ఆమెకు కుటుంబ సభ్యులు నిశ్చితార్థం చేశారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. అయినా కూడా తల్లిదండ్రులు మాత్రం ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి నిరాకరించి, తమ కులం కుర్రాడితో వివాహంను నిశ్చయించారు. పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న ప్రేమికుడు అమ్మాయి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. తమ ఇంటి ముందు దర్నాకు దిగిన ప్రేమికుడిపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వైపు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మాయి వైపు వర్షన్‌ ఏంటీ అనే విషయాన్ని కనుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయికి కూడా ఇష్టం అయితే, అమ్మాయి మేజర్‌ అయితే ఇరు వైపుల ఒప్పించి వివాహం చేయించాలని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.