అమెరికా మాజీ మహిళా బాక్సర్ మృతి..!!  

Boxer George Foreman\'s Daughter Da Foreman Found Dead In Texas-george Foreman Daughter,texas,women Boxer

అమెరికాలో మొట్టమొదటి మహిళ బాక్సర్ గా అమెరికాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఫ్రీదా ఫోర్‌మన్‌ హటాత్తుగా మృతి చెందారు. రెండు సార్లు ప్రపంచ హెలీవెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌, ప్రముఖ రచయిత, రాజకీయవేత్త అయిన జార్జ్‌ ఫోర్‌మన్‌ కూతురే ఈ ఫ్రీదా ఫోర్‌మన్‌...

అమెరికా మాజీ మహిళా బాక్సర్ మృతి..!!-Boxer George Foreman's Daughter Freeda Foreman Found Dead In Texas

అయితే ఆమెని పలకరించాలని ఆమె ఇంటికి వచ్చిన కుటుంభ సభ్యులకి ఆమె మృత దేహం కనిపించడంతో షాక్ కి గురయ్యారు.

ఆమె ఎందుకు, ఎలా మరణించిందో ఇంకా తెలియరాలేదు. కానీ ఈ మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం ఇది హత్య కాదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే 42 ఏళ్ల ఫ్రీదా 2000 సంవత్సరం నుంచి 2001 వరకు బాక్సర్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించింది. తన ఏడాది బాక్సింగ్‌ కెరీర్‌లో సాధించిన 5 విజయాల్లో 3 నాకౌట్లు నమోదు చేసింది. ఒకే ఒక్కసారి ఓటమి చెందింది.

జార్జ్‌ ఫోర్‌మన్‌ కు ఉన్న పిల్లల్లో ఫ్రీదా ఒకరు.