క్యాన్సర్ ట్రీట్మెంట్ కు ఢిల్లీ వెళ్లిన మాజీ బాక్సర్, కరోనా పాజిటివ్

ప్రముఖ బాక్సర్, 1998 ఏషియన్‌ గేమ్స్‌ బంగారు పతక విజేత డింగ్కో సింగ్‌కి కరోనా పాజిటివ్ తేలినట్లు తెలుస్తుంది.లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కు ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది.1998 బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన డింగ్కో బంగారు పతకాన్ని సాధించారు.అదే సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు అర్జున అవార్డును ప్రధానం చేసింది.

 Boxer Dingko Singh Tests Positive For Covid-19 ,covid 19, Boxer Dingko Singh,-TeluguStop.com

అలాగే 2013లో డింగ్కో భారత అత్యున్నత పురష్కారాల్లో నాలుగవదైన పద్మ శ్రీ ని అందుకున్నారు.ఇక భారత నేవీలో సైతం పనిచేసిన డింగ్కో బాక్సింగ్‌ కోచ్‌గా కూడా పనిచేశారు.

ఆ తరువాత క్యాన్సర్‌ బారిన పడటంతో ఇంటి దగ్గరే ఉన్నారు.అయితే లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అని ఆయన గత నెల ఢిల్లీ కి వెళ్లి వచ్చారు.

ఢిల్లీ నుంచి స్వరాష్ట్రం అయిన మణిపూర్ కి చేరుకోగా,ఢిల్లీ లో ఆయనకు సేవలు అందించిన నర్సు కి కరోనా సోకడం తో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించారు.అయితే ఆ ఫలితాల్లో ఆయనకు నెగిటివ్ రావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించగా ఆ పరీక్షల్లో డింగ్కో కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

దీనితో ఢిల్లీలో ఆయనతో కాంటాక్డ్ లో ఉన్న అందరికి కూడా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఏ విధంగా ఆయనకు కరోనా సోకింది అన్న విషయం అర్ధం కావడంలేదు.ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన ఇప్పటికే క్యాన్సర్ తో పోరాడుతుండగా,కరోనా కూడా సోకడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ సహా పలువురు బాక్సర్ లకు డింగ్కో ను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube