ఆస్పత్రులలో బౌన్సర్లు ఏం చేస్తున్నారో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చింది.దీన్ని అదనుగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల నుండి డబ్బులను అడ్డంగా దోచుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

 Bouncers In Private Hospitals, Corona Effect, Private Hospitals, Bills, Corona-TeluguStop.com

ఈ విషయంపై ప్రభుత్వాలు ఎన్నిసార్లు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చిన వాటిని ప్రైవేటు ఆస్పత్రులు బేఖాతరు చేస్తూ ప్రజల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి.

ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రులలో అడ్మిట్ అవ్వాలంటే రెండు లక్షల రూపాయలు మినిమం డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

అంతేకాక అక్కడ ఒకరోజు అడ్మిట్ అయినందుకు డబల్ డిజిట్ సంఖ్యలో లక్షల రూపాయలు బిల్ రూపంలో చెల్లించవలసిన పరిస్థితి నెలకొంది.ఒకవేళ అలా చెల్లించిన యెడల బంధువులను బాధితుడిని చూడడానికి అనుమతించట్లేదు.

దీనితో బాధితుని బంధువులు హాస్పిటల్ యాజమాన్యాలతో గొడవలు పడుతున్నారు.వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులు బౌన్సర్ లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే ప్రభుత్వం,హై కోర్టు అమానుషంగా ప్రవర్తిస్తున్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు తాళాలు వేశాయి.అయినప్పటికీ మారిన ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కరోనా లాంటి మహమ్మారి ఉధృతంగా వ్యాప్తిస్తున్న సమయంలో బాధ్యత లేకుండా ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నాయి.

మరి వీటి దోపిడీ నుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube