తాగుబోతులను చంపేస్తున్న మద్యం బాటిల్స్‌.. మందు కంటే ఖాళీ బాటిల్స్‌ ప్రమాదం

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రతి రోజు ఎక్కడో ఒక చోట లేదంటే పలు చోట్ల చూస్తూనే ఉంటాం.అయినా కూడా ఎక్కువ శాతం మంది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా విషం వంటి మందును తాగేందుకు వెళ్తూనే ఉంటారు.

 Bottles Of Beer Contain Harmful Levels Of Toxic Elements1-TeluguStop.com

మద్యపానం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.అయినా కూడా వారిని చూసుకుంటూనే మద్యం తాగే వారు ఎంతో మంది ఉన్నారు.

మద్యంపానం వల్లే కాకుండా వాటిని క్యారీ చేసే బాటిల్స్‌ కూడా ప్రాణానికి హానికరం అంటూ నిపుణులు తేల్చారు.

తాగుబోతులను చంపేస్తున్న మద్య

బీర్‌తో పాటు ఇంకా పలు ఆల్కహాల్‌ ప్రోడక్ట్స్‌ను క్యారీ చేసే బాటిల్స్‌ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.ఆ బాటిల్స్‌ను తయారు చేసేందుకు ప్రమాదకరమైన రసాయన పదార్థాలను వాడుతున్నారట.ఎక్కువ మద్యపానం సేవించే వారిలో మెల్ల మెల్లగా ఆ రసాయనాలు శరీరంలోకి చేరుతున్నాయని, తద్వారా చనిపోతున్నారని వెళ్లడయ్యింది.

తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్లైమౌత్‌ వర్శిటీ చేసిన ప్రయోగంలో ఆల్కహాల్‌ బాటిల్స్‌లో ఉన్న విష పదార్థాల గురించి భయంకరమైన విషయాలు తెలిశాయి.

తాగుబోతులను చంపేస్తున్న మద్య

మద్య సీసాల తయారి కోసం లెడ్‌ మరియు కాడ్మియం అనే రసాయనాలను వాడుతున్నారు.బాటిల్స్‌ను కలర్‌ఫుల్‌గా తయారు చేసేందుకు వాడే పదార్థాల్లో కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయ పదార్థాలు ఉన్నాయి.దాంతో మద్యం సీసాల వల్ల ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రయోగంలో వెళ్లడయ్యింది.

ముఖ్యంగా ఆకుపచ్చ రంగు ఉండే మద్యం సీసాలు చాలా ప్రమాదకరమైన రసాయనాలను కలిగి ఉంటాయని అంటున్నారు.ఇక రీసైకిలింగ్‌ పదార్థాలతో తయారైన బాటిల్స్‌లో మరింత ఎక్కువగా రసాయనాలుండే ప్రమాదం ఉందని పరిశోదనలో వెళ్లడయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube