సోషల్ మీడియా వేదికగా రోజు రోజుకు కొత్త కొత్త ఛాలెంజ్ లు వస్తున్నాయి.మొన్నటివరకు ఫిట్ నెస్ ఛాలెంజ్ తో తెగ వీడియో లు షేర్ చేసిన సెలబ్రిటీ లు ఇప్పుడు తాజాగా మరో కొత్త ఛాలెంజ్ లో చేయడానికి సిద్ధపడ్డారు.
ప్రస్తుతం ఈ కొత్త రకం ఛాలెంజ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.అదే బాటిల్ క్యాప్ ఛాలెంజ్.
ఇప్పుడు సెలబ్రిటీ లు అందరూ కూడా ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లో మునిగిపోయారు.ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తమ అభిమానులకు టార్గెట్ విసురుతున్నారు.
అసలు ఇంతకీ ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఏంటి అని అనుకుంటున్నారా.అదే కాలిని గాల్లోకి లేపి బాటిల్ మూత ఊడేలా తన్నడమే.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే ఛాలెంజ్ నడుస్తుంది.
దీన్ని ముందుగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హల్లోవే ప్రారంభించగా, ప్రముఖ సింగర్ జాన్ మేయర్ దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాడు.
అలా పాకుతూ వస్తోన్న ఈ ఛాలెంజ్‌ను కిలాడీ హీరో అక్షయ్ కుమార్ కూడా పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అంతేకాకుండా సీనియర్ నటుడు అర్జున్ కూడా ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త ఛాలెంజ్ పై పడింది.ఇక ఈ ఛాలెంజ్ కు సంబంధించి ఇంకెన్ని వీడియో లో పోస్ట్ అవుతాయో చూడాలి.
.