రాజధాని అమరావతి పై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న 3 రాజధానులకి సంబంధించి బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం వెంటనే సమగ్రమైన మెరుగైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించడం తెలిసిందే.దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 Botsa Satyanarayana Sensatational Comments On Amaravathi Capital , Botsa Satyana-TeluguStop.com

ప్రభుత్వానికి కీలకమైన విషయాల్లో స్పష్టత లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు.

మేటర్ లోకి వెళ్తే అమరావతి స్మశానం అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇంకా కట్టుబడి ఉన్నట్లు తాజాగా మరొకసారి చెప్పుకొచ్చారు.

తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులు గతంలో అమరావతి పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా.? అని బొత్స సత్యనారాయణ అని ప్రశ్నించగా దానికి పై రీతిలో స్పందించారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని.

చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తానంటే అక్కడేముంది శ్మశానంలా ఉంచారని అన్నానని,.ఇక్కడ కొచ్చి ఏం చూస్తారు.? ఏం చేస్తారు.? అని గతంలో చేసిన వ్యాఖ్యలకి ఇంకా కట్టుబడి ఉన్నట్లు మరోసారి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక అమరావతి రైతులకు పరిహారం ఇస్తామని ఫ్లాట్లు కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పం.

Telugu Amaravathi-Telugu Political News

కానీ వారి మనసులో ఉన్నట్టు అని చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు.అమరావతి విషయంలో బీజేపీ నాయకులు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పారు.ఖచ్చితంగా మూడు రాజధానులు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిలోనే పరిపాలించాలి అన్న రూల్ ఎక్కడైనా ఉందేమో చూపించాలని.బొత్స పేర్కొన్నారు.

ఏది ఏమైనా మూడు రాజధానులు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్న తరహాలో.బొత్సా సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube