ఎస్‌ఈ‌సి నిర్ణయం వెనుక కనిపించని రాజకీయ శక్తి ఉంది

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేసిన సంగతి అందరికి తెలిసిందే.అందుకు ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు.

 Botsa Satyanarayana Comments On Sec , Botsa Satyanarayana, Jagan Ammavadi, Nimma-TeluguStop.com

ఈ విషయంపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్‌ఈ‌సి పై ఆరోపణలు చేశాడు.రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఎన్నికలు వద్దు అంటున్న ఎస్‌ఈ‌సి మాత్రం పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం వెనుక కనిపించని రాజకీయ శక్తులు హస్తం ఉందని బొత్స ఆరోపించాడు.

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమ్మఒడి రెండో దఫా కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు.ఈ సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రకటన చేశారో అర్థం కావడం లేదని బొత్స అన్నాడు.

నా రాజకీయ జీవితంలో ఓ ఎన్నికల అధికారి రాజకీయ నేతలతో సీక్రెట్ గా మంతనాలు జరపడం నేను ఎప్పుడు చూడలేదని అన్నాడు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీకి 95 శాతం వరకు మేజారిటీ వస్తుందని అన్నాడు.

ఈ సమయంలో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే సమయంలో ఏదో ఒక్క రూపంలో రాష్ట్రంలో ఈలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube