500 ఏంటి 1000 రోజులు ఉద్యమం చేయండి..!

అమరావతి 500 రోజుల ఉద్యమంపై స్పందించారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.అమరావతి ఉద్యమం 500 రోజులు కాదు వెయ్యి రోజులు చేయండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారని అన్నారు బొత్స సత్యనారాయణ.

 Botsa Satyanarayana Comments Amaravathi Agitations, Agitations, Amaravathi, Bot-TeluguStop.com

కోర్టులకు వెళ్లడం వల్లే అక్కడ అభివృద్ధి ఆలస్యం అవుతుందని అన్నారు.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటుగా అమరావతిని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

అమరావతిని కూడా అభివృద్ధి చేసి తీరుతాం.అక్కడ రైతులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతామని చెప్పారు బొత్స సత్యనారాయణ.

ఇక దీనితో పాటుగా సెక్రటేరియట్ లో కరోనా తీవ్రత గురించి స్పందించిన బొత్స అక్కడ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం డిమాండ్ చేయడంతో అది కుదరదని చెప్పారు.ఏపీ సెక్రటేరియట్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

అందుకే వారికి వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సాధ్యపడదని.ఆ విషయం గమనించాలని అన్నారు బొత్స సత్యనారాయణ.సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే తప్ప మిగతా వారికి వర్క్ ఫ్రం హోం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం టైం లో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనితీరుని మెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube