నాయకులు ఎంత సహాయం చేశారు?

వరదలు , తుఫాను మొదలైన ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు సమాజంలో అన్ని వర్గాల వారిని బాధితులను ఆదుకోవల్సిందిగా కోరుతుంటారు.కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడుగుతారు.

 Botsa Appeals For Relief Measures Towards Chennai Floods-TeluguStop.com

అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు సహాయం కోసం విజ్ఞప్తి చేస్తారు.విపత్తుల సమయంలో ఇలా విజ్ఞప్తి చేయడం సమంజసమే.

ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేయకముందే సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారు ఆర్ధిక సహాయం చేస్తూనే ఉంటారు.చెన్నై వరదలకు చలించిపోయిన తెలుగు సినిమా హీరోలు కొందరు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

అల్లు అర్జున్ ;పాతిక లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ ;అది లక్షలు … ఇలా తారలు అనేకమంది సహాయం ప్రకటించారు.ఇలా మానవత్వంతో స్పందించడం అభినందనీయం.

ఆంధ్రప్రదేశ్లోనూ కడప , చిత్తూరు , నెల్లూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.కాబట్టి అక్కడి బాధితులకు కూడా సహాయం అందించాలి.

చెన్నై బాధితులకు సహాయం ]చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు.తమిళనాడు అధికారులతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాలకు, ప్రజలకు విజ్ఞప్తులు చేయడం కాకుండా తాము కూడా వ్యక్తిగతంగా సహాయం చేసి ఆదర్శంగా నిలవాలి.కానీ ఎప్పుడూ రాజకీయ నాయకుల పేర్లు వినబడవు.

కొందరు సహాయం చేసినా బయటకు చెప్పారేమో తెలియదు.ఆంధ్రప్రదేశ్లో వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ చెన్నై బాధితులకు, ఏపీ బాధితులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంచిదే.కానీ తాను ఎంత సహాయం చేశారో చెప్పాలి.

వైకాపా తరపున సహాయం చేశారా చెబితే బాగుంటుంది.ఇది ఇతర రాజకీయ పార్టీలకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది .విమర్శలతో పాటు సహాయం చేయడం కూడా నాయకుల బాధ్యత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube