బాబు ఇంటిని కూల్చబోతున్నట్లుగా పుకార్లు  

Botsa Satyanaranaya Comments On Chandrababu House-media News

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను నేడు కూల్చి వేయబోతున్నట్లుగా కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి.ఆ వార్తలతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.బాబు ఇంట్లోనే ఉండగా ఎలా కూల్చి వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చి వేత గురించి మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు.

Botsa Satyanaranaya Comments On Chandrababu House-media News-Botsa Satyanaranaya Comments On Chandrababu House-Media News

నేడు కృష్ణ నది కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న భవనాలను కొన్నింటిని కూల్చివేసిన మాట నిజమే అని, కాని వాటిలో చంద్రబాబు నివాసం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.చంద్రబాబు నివాసం కూల్చి వేతకు కాస్త సమయం ఉందని ఆయన అంటున్నారు.కోర్టు ఆదేశాలు మరియు నది పరివాహక ప్రాంతం చట్టంకు అనుగుణంగానే భవనాలను కూల్చి వేస్తున్నట్లుగా బొత్స పేర్కొన్నారు.

Botsa Satyanaranaya Comments On Chandrababu House-media News-Botsa Satyanaranaya Comments On Chandrababu House-Media News

ఈ విషయంలో మీడియా అనవసర రాద్దాంతం చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆయన హెచ్చరించాడు.