ఎస్‌ఈ‌సి పై బొత్స ఆరోపణలు..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం ఎందుకు అంత తొందర పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు.మహమ్మారి కరోనా వైరస్ భయం కారణంగా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా తెగ భయం ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

Telugu Andhra Pradesh, Ysrcp-Telugu Political News

నిష్పక్షపాతంగా అదే విధంగా పారదర్శకంగా ఎన్నికలను జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ పై ఉంటుందని.కానీ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈ‌సి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు.

స్టేట్ ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా భయపడరని పేర్కొన్నారు.14వ ఆర్థిక సంఘం నిధుల సమస్య ప్రస్తుతం లేదని ఈ క్రమంలో ఎస్‌ఈ‌సి కి ఎందుకు అంత తొందర, ఆలస్యమైతే వచ్చే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు.అంతేకాకుండా రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు జరిగినా వైసిపి పార్టీకి 95% విజయ అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube