క్యాప్సికం సాగులో బొట్రేటిస్ ఎండు తెగులను అరికట్టే పద్ధతులు..!

బొట్రేటిస్ ఎండు తెగులు భూమి లోపల ఉండే బొట్రేటిస్ సినేరియా( Botrytis Cinerea ) అనే ఫంగస్ వల్ల క్యాప్సికం( Capsicum ) పంటను ఆశిస్తుంది.అధిక వర్షపాతం, అధిక తేమతో కూడిన వాతావరణం ఉన్న సమయంలో ఈ తెగులు పంటను ఆశించడానికి అవకాశం ఉంది.

 Botrytis Cinerea Fungus In Capsicum Cultivation Details, Botrytis Cinerea Fungus-TeluguStop.com

అంతేకాదు పొలానికి నీటి తడులు అధికంగా అందించడం, మొక్కల మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంగస్ తెగులుగా( Fungus ) మారి పంటను ఆశిస్తుంది.

క్యాప్సికం మొక్కలో భాగాలైన ఆకులు, కొమ్మలు, కాండం, మొగ్గలపై బూడిద రంగు రూపంలో బూజు ఏర్పడుతుంది.

తర్వాత వీటి వ్యాప్తి పెరిగి బూడిద, గోధుమ రంగు శిలీంధ్రాలు ఏర్పడతాయి.తర్వాత క్రమంగా వాలిపోయి చనిపోతాయి.

Telugu Agriculture, Botrytiscinerea, Botrytis Fungus, Capsicum, Capsicum Crop, F

తెగులను తట్టుకునే మేలైన క్యాప్సికం రకాలను ఎంచుకోవాలి.మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఎరువులను తక్కువ మోతాదులో ఉపయోగించాలి.అవసరం అయితేనే నీటి తడులు అందించాలి.ముఖ్యంగా సూర్యరశ్మి, గాలి మొక్కకు బాగా తగిలే విధంగా పంటను విత్తు కోవాలి.కలుపు ను నివారించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.

చాలా రకాల పురుగులు, తెగుళ్లు కలుపు మొక్క ద్వారానే పంటను ఆశించే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి కలుపు విషయంలో నిర్లక్ష్యం తగదు.

Telugu Agriculture, Botrytiscinerea, Botrytis Fungus, Capsicum, Capsicum Crop, F

ఈ తెగులను సకాలంలో గుర్తించి నివారించాలి.కాస్త ఆలస్యంగా పంట కోత సమయంలో గుర్తిస్తే నివారించడం చాలా కష్టం.పంట కోత సమయంలో రసాయన పిచికారి మందులను ఉపయోగిస్తే పంట విషపూరితం అవుతుంది.ఈ తెగులు గుర్తించబడిన వెంటనే క్లోరోతలోనిల్ ను ఉపయోగించి నివారించవచ్చు.ఒకవేళ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే ప్లూవాజినం, థియోఫానేట్- మిథైల్ లను ఉపయోగించి తక్షణమే నివారించాలి.ఈ పద్ధతులను సక్రమంగా పాటిస్తే తెగుల నుండి క్యాప్సికం పంటను సంరక్షించుకుని అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube