చెప్పింది ఎక్కువా!!..చేసింది తక్కువ

ఒక రాష్ట్రం కాస్తా రెండు గా మారింది.ఒక చోట చంద్ర బాబు, మరో చోట చంద్ర శేఖర రావు ఇద్దరూ ఎవరికి వారు తామేదో ప్రజలను ఉద్దరించేస్తున్నట్లు ప్రకటించుకుంటూ ప్రకటనలు చేసుకుంటున్నారు.

 Both Government’s Fails-TeluguStop.com

అయితే ఇంతవరకు ఎలా ఉన్నా ఇప్పటి వరకు వారు మాటల్లో చెప్పడమే తప్పా చేతల్లో చేసింది ఏమీ లేదు అంటున్నాయి రాజకీయ విమర్శక వర్గాలు.విషయానికి వస్తే ఇరు రాష్ట్రాలో ఇద్దరు చంద్రులూ వ్రుద్దాప్య పింఛెన్ ల విషయంలో ప్రగల్భాలు పలికారు.

చంద్రబాబు సైతం వ్రుద్దాప్య పింఛెన్ లను వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకుంటుంటే, తమ పార్టీ నేతలైతే ఏకంగా చంద్రన్నను ప్రజలు ఫోటోల్లో పెట్టుకుని పూజిస్తున్నారు అంటూ పుబ్లిసిటీ సైతం చేసుకుంటున్నారు.మరో పక్క కేసీఆర్ సైతం తెలంగాణాలో పింఛెన్ ల విషయంలో తమకు తోచిన విధానంలో తమ ప్రభుత్వాన్ని తాము పొగడ్తలతో ముంచుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అయితే అసలు వృద్దుల పక్షాన నిలబడితే మాత్రం ఎంతో మంది వృద్దులు పింఛెన్ లకు అర్హులు కారు అంటూ లిస్ట్ లో పేరులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అంతేకాకుండా తెలంగాణాలో అయితే ఈ పింఛెన్ ల కోసం జరిగిన తిక్కిసలాటలో కొన్ని పండుటాకులు రాలిపోయాయి.ఇక మరి కొందరు అయితే ఈ కాలం లో చలి తీవ్రత ఎక్కువ కావడంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దనే చలిలో వణుకుతూ రాలిపోతున్నారు.

ఏది ఏమైనా పెంచడం మాట దేవుడికి ఎరుక గాని, పాపం రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు వృద్దులకు శాపంగా మారాయి.మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సరైన పద్దతులు పాటించి వృద్దులకు అండగా నిలవాలని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube