అరే ఇద్దరూ ఒకేరోజు ప్రమాణస్వీకారం!  

Both Are Doing Oath In Same Day-friday,jagan Mohan Reddy,narendra Modi,ysrcp,జగన్మోహన్ రెడ్,నరేంద్ర మోడీ

కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇటు ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పీ ఎం గా మోడీ,ఏపీ సి ఎం గా జగన్ ఒకేరోజు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గురువారం విడుదల అయిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..

అరే ఇద్దరూ ఒకేరోజు ప్రమాణస్వీకారం!-Both Are Doing Oath In Same Day

ఎన్డీయే భాగస్వామి అయినా బీజేపీ కూడా 300 మార్క్‌ను దాటడం తో ఆ పార్టీ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరోపక్క లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం తో ఇక ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమైంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అయి,16వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేయనుంది. అలానే మే 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి మోదీని ప్రధానిగా ఎన్నుకొనున్నారు. దీనితో మే 30 సాయంత్రం 5 గంటలకు మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో ప్రధాని గా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధిపతులందర్నీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే మరి రెండోసారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోడీ ఎవరెవరిని ఆహ్వానిస్తారు అన్న విషయం పై ఇంకా స్పష్టత లేదు.