మోహన్ బాబు మూలంగా సినిమాలను వదిలి.. వ్యాపారవేత్త అయ్యాడు..

మోహన్ బాబు. తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడు.

 Bosu Babu Who Became Business Man Instead Of Hero Due To Mohan Babu Details, Bos-TeluguStop.com

తన అద్భుత నటనతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యాడు.విలన్ గా, హీరోగా, కమెడియన్ గా ఎన్నో అద్భుత పాత్రలు పోషించాడు మోహన్ బాబు.

దాసరి చల్లటి చూపుతో తన దగ్గరే సినిమాల్లో ఓనమాలు నేర్చుకున్నాడు.ఆయన దగ్గరే అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు.

అనుకోకుండా సినిమా హీరోగా మారాడు.ఆ సమయంలో చాలా మంది దర్శకులు కావాలని సినిమా పరిశ్రమలోకి వచ్చి హీరోలుగా మారారు.

1975లో దాసరి కొత్త వారితో స్వర్గం నరకం అనే సినిమా చేయాలి అనుకున్నారు.అందులో మోహన్ బాబు, ఈశ్వర్ రావు, హీరోలుగా అనుకున్నారు.

కానీ అనుకోకుండా బోసుబాబు అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.ప్రొడక్షన్ వాళ్లు బోసు బాబును హీరోగా తీసుకోవాలి అనుకున్నారు.

ఈనేపథ్యంలో దాసరి ఏం చేయాలా? అని ఆలోచించారు.అదే సమయంలో మోహన్ బాబుకు, బోసుబాబుకు ఓ పరీక్ష పెట్టాడు.

ఎవరు బాగా నటిస్తే వారికి అవకాశం ఇస్తానని చెప్పాడు.సరే అన్నారు.

మోహన్ బాబు నటన అక్కడ ఉన్నవారికి అందరికి నచ్చింది.ఆయన హీరోగా మారాడు.

అటు బోసు బాబు సినిమాలను వదిలి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు.

Telugu Bosu Babu, Dasari, Eeswara Rao, Mohan Babu, Lakshmi Prasana, Bose Babu, S

తన వ్యాపారం కాస్త బలపడటంతో ఎస్వీర్ సర్వీసెస్ ప్రారంభించాడు.మోహన్ బాబు మూలంగా బోసుబాబు వ్యాపారవేత్తగా మారాడు.నిజానికి అన్నీ అందరికీ కలిసి రావు.

ఎవరికి ఏది జరగాలో అదే జరుగుతుంది.సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న మోహన్ బాబుకు సినిమా రంగం కలిసి వచ్చింది.

బోస్ బాబుకు వ్యాపారం కలిసి వచ్చింది.

Telugu Bosu Babu, Dasari, Eeswara Rao, Mohan Babu, Lakshmi Prasana, Bose Babu, S

వ్యాపారంలో బలపడిన బోసు బాబు ఆ తర్వాత నిర్మాతగా మారాడు.అనేక సినిమాలను నిర్మించాడు.అటు మోహన్ బాబు సైతం సినిమా రంగంలో మంచి ప్రతిభ కనబర్చాడు.

కొంత కాలం తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించాడు.తన బిడ్డపేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఏర్పాటు చేశాడు.

దాని ద్వారా పలు సినిమాలను తీశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube