బిగ్‌బాస్‌పై పునరాలోచినలో స్టార్‌ మా

గత నెలలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.షూటింగ్‌కు అనుమతులు వచ్చిన వెంటనే బుల్లి తెరకు చెందిన పలు సీరియల్స్‌, షోలకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.

 Star Maa Thinking About Telugu Big Boss Season 4 , Star Maa, Big Boss, Bithiri S-TeluguStop.com

ఈ సమయంలోనే తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కంటెస్టెంట్స్‌ ఎంపిక మరియు హోస్ట్‌ విషయంలో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే అసలు విషయం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

ఇస్మార్ట్‌ న్యూస్‌ నుండి తప్పుకున్న బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి బిగ్‌బాస్‌కు ఎంపిక అయ్యాడని, ఆ తర్వాత సింగర్‌ సునీత, యాంకర్‌ జాన్సిలతో పాటు మరికొందరు కూడా బిగ్‌బాస్‌ 4 ఇంట అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో బుల్లి తెర రకంగానికి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది.

వరుసగా పదుల సంఖ్యలో బుల్లి తెరకు చెందిన వారు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ విషయమై స్టార్‌ మా వారు పునరాలోచనలో పడ్డారట.

Telugu Big Boss, Bithiri Sathi, Jhansi, Maa, Sunitha, Telugu, Tollywood-

బిగ్‌బాస్‌ షోను చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని భావించారు.షూటింగ్స్‌ ఎంత జాగ్రత్తగా చేస్తున్నా కూడా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుంది.కనుక బిగ్‌బాస్‌కు ఎంత జాగ్రత్తలు పాటించినా కూడా ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉంది.

ఒక వేళ ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా కూడా మొత్తం షో నాశనం అవ్వడంతో పాటు పూర్తిగా టీఆర్పీ రేటింగ్‌ పడిపోతుందని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు అనుకుంటున్నారు.అందుకే ఇంకాస్త సమయం తీసుకుని బిగ్‌బాస్‌పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube