దుబాయ్: కాపురంలో చిచ్చుపెట్టిన ‘మేసేజ్’..భార్యను పొడిచి చంపిన భారతీయుడు  

Indian Man In The United Arab Emirates (uae) Has Allegedly Stabbed His Wife To Death - Telugu Indian Man Allegedly Stabbed His Wife To Death, Nri, Telugu Nri News Updates

అనుమానం పెనుభూతంగా మారి దుబాయ్‌లో ఓ భారతీయుడు కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి పొడిచి చంపాడు.44 ఏళ్ల భారతీయుడు గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్ వచ్చాడు.సెప్టెంబర్ 9న నగరంలోని అల్ ఖ్వాజ్ పారిశ్రామిక ప్రాంతంలో భార్య పనిచేసే కార్యాలయానికి వెళ్లాడు.

Indian Man In The United Arab Emirates (uae) Has Allegedly Stabbed His Wife To Death

అంతకుముందు యజమాని ఆమెకు పంపిన మేసేజ్‌ను చూసిన అతను భార్యపై అనుమానంతో నిలదీశాడు.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.సహనం నశించిన అతను పదునైన కత్తితో భార్యను మూడు సార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత బాధితురాలి మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.ఓ మహిళ మృతదేహం పార్కింగ్ ప్రదేశంలోని కార్ల మధ్య పడివుందని, ఆమె పొత్తికడుపు, ఎడమ తొడపై లోతైన కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు.మృతదేహం పక్కనే హత్యకు ఉపయోగించిన కత్తి పడివుందని వెల్లడించారు.

మృతురాలి మేనేజర్ మాట్లాడుతూ.హత్య జరిగిన రోజు తాను ఆమెను కలవలేదని చెప్పారు.

బాధితురాలి భర్త నేరం చేసిన తర్వాత నగరం విడిచి పారిపోవాలని భావించాడని.కానీ చివరికి అరెస్టయ్యాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.

మృతురాలి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు భారత్‌లో ఉన్నారు.ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 2కు వాయిదా పడింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Man In The United Arab Emirates (uae) Has Allegedly Stabbed His Wife To Death-nri,telugu Nri News Updates Related....