మే నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు     2018-01-08   21:33:33  IST  Raghu V

మే నెలలో జన్మించిన వారికి నీతి,నిజాయితీ,త్యాగం,న్యాయం,ధర్మం అనే పంచ సూత్రాలు రక్షణ కవచాలుగా ఉంటాయి. ఈ నెలలో పుట్టినవారు ఓర్పు,త్యాగ బుద్ది కలిగి ఉంటారు. వీరిలో మానవత్వం ఎక్కువగా ఉండుట వలన అందరిని ప్రేమిస్తారు. వీరు మానసికంగా ఎదుటివారికి సాయం చేయాలనే ఆలోచనతో ఉంటారు. దాని కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధపడతారు. వీరు ఎక్కువగా పార్టీలలో పాల్గొంటూ ఉంటారు. అంతేకాక కొత్త కొత్త ప్రదేశాలను చూడాలనే కోరిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

వీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. స్నేహితులు,పార్టీలు అంటూ ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతారు. అవసరమైతే రుచి కోసం వారే ఆహారాన్ని తయారుచేసుకుంటారు. వీరు కొన్ని సందర్భాలలో న్యాయము కోసం, ధర్మం కోసం పోరాడి చివరకు ఓటమిని కూడా చవి చూడాల్సి రావచ్చు. వీరు తన ఇంటిని, ఇంటి పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవటానికి ఇష్ట పడతారు.

వీరు సంసార జీవితము ఆశా జనకముగా ఉంటుంది. వీరు నమ్మిన వారి కోసం అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయరు. ఈ నెలలో పుట్టిన వారు మంచి కళాకారులుగాను, మంచి ఉద్యోగస్తులుగాను, మంచి ప్రజా సేవకులు గాను గౌరవ స్థానములో ఉండి గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో చాలా మందికి చిన్న వయసులోనే వివాహము జరిగే సూచనలు ఉన్నాయి.

ఆరోగ్యము : మే నెలలో జన్మించిన వారికి ఎక్కువగా రక్తపోటు మరియు కిడ్నీకి సంబందించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనము : వీరు ధనము బాగా సంపాదిస్తారు. ఎక్కువ సంపాదించాలి అనే కోరిక కూడా చాలా బలంగానే ఉంటుంది. లక్కీ వారములు : మంగళ మరియు శుక్ర వారాలు. లక్కీ కలర్ : రోజ్ కలర్ మరియు బ్లూ రంగు. లక్కీ స్టోన్ : డైమండ్ లేదా ముత్యము.