ఫిబ్రవరి నెలలో పుట్టినవారి గురించి ఆసక్తికరమైన నిజాలు     2017-12-30   21:26:34  IST  Raghu V

ఫిబ్రవరి నెలలో పుట్టినవారు పిరికితనంతో ఉంటారు. వీరు కాస్త బలహీనంగా ఉండటమే కాకుండా అదృష్టం కొంచెం తక్కువగా ఉంటుంది. దాంతో వీరి పనులు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే వీరు పట్టుదలతో చదివితే మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. అంతేకాక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే వీరిలో ఉన్న లోపాలను బయటకు కనపడకుండా జాగ్రత్త పడతారు. వీరు చాలా సున్నితమైన మనస్సు కలవారు. దాంతో ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు.

వీరిలో ఎంత ప్రేమ ఉంటుందో అదే స్థాయిలో కోపం కూడా ఉంటుంది. వీరు ఇతరులతో మంచి స్నేహ సంబంధాలను కలిగి ఉంటారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి స్థితికి చేరతారు. వీరు జీవితంలో నష్టపోకుండా పైకి రావాలంటే అతి భయం, పిరికితనం, సున్నిత మనస్తత్వం వదులుకోవాలి. వీరు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి.


ఆరోగ్యము : లివర్ వ్యాధులు, నరముల బలహీనత వంటి వ్యాధులు వీరిని బాధించే అవకాశం ఉంది. వైద్యులకూ అర్ధం కాని పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ధనము : వీరికి ఎక్కువగా రైల్వే, భీమా సంస్థలు, ఎలక్ట్రికల్ పనుల వలన మరియు ధర్మ సంస్థలు వలన మంచి ఆదాయం వచ్చే అవకాసము ఉంది.

లక్కీ వారములు : బుధ, శని వారములు.
లక్కీ కలర్ : గ్రేకలర్, కాషాయరంగు.
లక్కీ స్టోన్ : డైమండ్.