బ్రిటన్: బోరిస్ జాన్సన్ సిబ్బందికి క‌రోనా.. ఐసోలేషన్‌కు వెళ్లని ప్రధాని..!!

డెల్టా వెరియంట్ బ్రిటన్‌ను వణికిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకి అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

 Boris Johnson Wont Isolate After Staff Member Tests Covid Positive, Uk Pm Boris-TeluguStop.com

తాజాగా వైరస్ మళ్లీ బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ సమీపంలోకి వెళ్లింది.ఆయన సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

గ‌త బుధ‌, గురు వారాల్లో అధికారిక ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌తో క‌లిసి తిరిగిన సిబ్బందిలో ఒక‌రికి క‌రోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.ఇలాంటి పరిస్దితుల్లో ఖచ్చితంగా ప్రధానితో పాటు మిగిలిన సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలి.

కానీ అయినా బోరిస్ జాన్స‌న్‌కు సెల్ఫ్ ఐసోలేష‌న్ అవ‌స‌రం లేద‌ని పీఎంవో కార్యాలయం స్ప‌ష్టం చేసింది.

బోరిస్ జాన్సన్ బుధ‌, గురువారాల్లో ఫిఫేలోని ఓ పోలీస్ కాలేజీని, అబెర్డీన్ షైర్‌లోని ఓ విండ్‌ఫామ్‌ని సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నతో క‌లిసి తిరిగిన సిబ్బందిలో ఒక‌రు శుక్ర‌వారం స్కాట్లాండ్‌కు వెళ్లిరాగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు.ప‌రీక్ష‌ల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్‌గా తేలినా ప్ర‌ధానికి ఐసోలేష‌న్ అక్క‌ర్లేద‌ని డౌన్ స్ట్రీట్ పేర్కొంది.

అన్ని ర‌కాల కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని, సిబ్బందిలో ఏ ఒక్క‌రితోనూ బోరిస్ క్లోజ్ కాంటాక్ట్‌లో ఉండే అవ‌కాశం లేద‌ని డౌన్ స్ట్రీట్ సిబ్బంది వెల్ల‌డించారు.

Telugu Borisjohnson, Britain, Corona London, Covid, Delta, Ukpm-Telugu NRI

కాబ‌ట్టి సిబ్బందిలో ఎవ‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ప్ర‌ధానికి ఐసోలేష‌న్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.అయితే దీనిపై ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న‌ది.అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను ఫూల్స్‌ను చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

అధికార పార్టీ నేత‌లు త‌మ‌కు ఓ రూల్‌, దేశ ప్ర‌జ‌లందరీకి ఒక రూల్‌ను అమ‌లు చేస్తున్నార‌నడానికి ఇది కూడా ఒక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు.

కాగా, గతేడాది ఏప్రిల్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

వైరస్ తీవ్రత అధికంగా వుండటంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు.అక్కడ కొన్నిరోజుల చికిత్స అనంతరం బోరిస్ జాన్సన్‌ డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సమయంలో ఆయన మరణం అంచులదాకా వెళ్లొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube