వైరల్: మొదటిరోజే జాబ్ బోర్ కొడుతుందని సెక్యూరిటీ గార్డ్ ఏకంగా కోట్లు విలువ చేసే ఆ పెయింటింగ్ ను..?!

కొంతమంది ఉద్యోగం కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు.ఉద్యగం రావాలి దేవుడా అని చాలామంది దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు.

 Bored Secutiry Guard Who Ruined Costly Painting Details, Viral Latest, News Vira-TeluguStop.com

అయితే ఈ వ్యక్తి మాత్రం ఉద్యోగంలో చేరిన మొదటిరోజునే తన ఉద్యోగం ఊడకోట్టుకున్నాడు.ఆ సెక్యూరిటీ గార్డ్ కు తాను చేసే ఉద్యోగం బోర్ కొట్టి చేసిన చిలిపి పనికి ఆ యజమాని లక్షలు ఖర్చు పెట్టాలిసి వచ్చింది.

ఇంతకీ అతను చేసిన పని ఏంటో తెలిస్తే ఒక పక్క నవ్వుతో పాటు మరోపక్క కోపం కూడా వస్తుంది.పెయింటిగ్స్ కు ఉన్న విలువ మనలో చాలా మందికి తెలియదు.

కొన్ని పెయింటింగ్స్ చూడడానికి పిచ్చి బొమ్మలాగా అనిపిస్తాయి కానీ వాటి విలువ మాత్రం కోట్లలో ఉంటుంది.

సరిగ్గా సెక్యూరిటీ గార్డ్ కూడా అలాగే అనుకుని తాను ఉద్యోగం చేసే చోట గ్యాలరీలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్‌ను రక్షించాల్సి సెక్యూరిటీనే దానిపై పెన్నుతో గీతలు గిసేసాడు.

ఈ ఘటన రష్యాలోని బోరిస్ ఎల్ట్సిన్ ప్రెసిడెన్షియల్ సెంటర్‌లో చోటు చేసుకుంది.అక్కడ ఒక వ్యక్తి గ్యాలరీలో ఉన్న ఆస్తుల్ని రక్షించే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంలో చేరాడు.

అయితే ఉద్యోగంలో చేరిన మొదటిరోజే ఆ వ్యక్తికి విసుగ్గా అనిపించి అక్కడ గ్యాలరీలో ప్రదర్శనలో ఉంచిన ‘త్రీ ఫింగర్స్‌’ పెయింటింగ్‌లో ఉన్న మూడు చిత్రాలకు ముఖాకృతి ఖాళీగా ఉన్నట్లు ఉందని భావించి రెండు ముఖాలపై తన బాల్‌పాయింట్‌ పెన్నుతో కళ్లను చిత్రికరించాడు.

అయితే ఘటన 2021 డిసెంబరు 7న జరిగింది.అయితే గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ ను వీక్షించేందుకు వచ్చిన కొందరు పర్యాటకులు ‘త్రీ ఫింగర్స్‌’ పెయింటింగ్‌లో వచ్చిన మార్పును గుర్తించి నిర్వాహకులకు తెలియజేశారు.అసలు ఈ పని చేసింది ఎవరు.? ఏంటి అని ఆరా తీయగా సెక్యూరిటీ గార్డ్ నిర్వహం చేసాడని తెలియడంతో యాజమాన్యం అతనిని విధుల నుంచి తొలగించింది.నిజానికి ఆ పెయింటింగ్ విలువ ఎంత అనేది కరెక్ట్ గా తెలియదు కానీ ఈ పెయింటింగ్ పేరిట రూ.7.51 కోట్ల విలువైన బీమా ఉందట.ఈ పెయింటింగ్ ను అన్నా లెపోర్స్కాయ అనే చిత్రకారుడు ‘త్రీ ఫింగర్స్‌’ పేరిట దీనిని సృష్టించారు.అయితే సంతోషించే విషయం ఏంటంటే ఈ విలువైన పెయింటింగ్‌పై పెన్నుతో బలంగా గీయలేదు కాబట్టి పెద్దగా నష్టం జరగలేదు.కానీ ఆ పెయింటింగ్ ను మళ్ళీ యధాస్థితికి తెచ్చేందుకు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube