అమెరికా సరిహద్దులో అలజడి..!!  

అమెరికా భూభాగం లోకి అక్రమ వలసదారులని రానివ్వకుండా చేపడుతున్న చర్యలు ఏ మాత్రం ఫలించడం లేదని చెప్పాలి. ఎదో ఒక రూపంలో చొరబాటు దారులు అమెరికాలోకి ఎదో ఒక మార్గంలో ప్రవేసిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సరిహద్దు రక్షణ దళాలు వారిని నిలువరించి వెనక్కి పంపుతూనే ఉన్నాయి.

ఈ అక్రమ వలస దారులని తమ దేశంలోకి అడుగు పెట్టకుండా ఉండటానికి ట్రంప్ మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని చేపట్టాలని గత కొంత కాలంగా డెమొక్రాట్ల మద్దతుకోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అమెరికా సరిహద్దుని దాటుకుని అమెరికా లోకి చొరబుతున్న మెక్సికన్లని..

అమెరికా అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటక్షన్ అధికారులు నిలువరించారు. అందుకు గాను ఒక ఫోటోని సైతం విడుదల చేశారు. ఎంతో మంది వలసదారులు ఇలా అమెరికా భూభాగం లోకి అక్రమంగా ప్రవేశిస్తే అమెరికా ప్రజలకి తీవ్ర నష్టం కలుగుతుందని ట్రంప్ వాదన.