బూస్ట్ యొక్క అత్యంత తాజా ప్రచారోద్యమం ఉద్భవిస్తున్న సూపర్‌స్టార్స్ కు అనగా స్టామినా స్టార్స్ కు ఒక ప్రారంభగీతముగా ఉంది

04, మార్చ్ 2022, ఇండియా: భారతదేశం యొక్క అతిపెద్ద ఆరోగ్యాహార పానీయాలలో ఒకటైన బూస్ట్, క్రికెట్ ప్రపంచంలో మరుగున ఉన్న మాణిక్యాలను వెలికితీసి సంబరం చేసుకోవడానికి ఒక ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది.ఈ ప్రచారోద్యమం, కష్టనష్టాలు ఎదురైనా సరిహద్దులకు త్రోసుకువెళ్ళడం కొనసాగిస్తున్న కొత్తవారైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గాయక్వాడ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, మరియు రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ వంటి వారిని కలిగి ఉంది.

 Boost’s Latest Campaign Is An Ode To The Emerging Superstars Aka The Stamina S-TeluguStop.com

ఈ ప్రకటన చిత్రం, తమ పట్టుదల, సంకల్పం మరియు అవిశ్రాంత పోరాట పటిమను ప్రపంచానికి చూపించిన ‘‘గేమ్ బడే యా ఛోటే గ్రౌండ్ కా నహీ, గేమ్ స్టామినా కా హోతా హై’ (ఆట చిన్న లేదా పెద్ద మైదానానిది కాదు, ఆట బలానిది) అనే ఈ ఆటగాళ్ళ యొక్క అత్యంత కఠోర పరిశ్రమను గ్రహిస్తోంది.

బూస్ట్ యొక్క స్టామినా స్టార్స్ ప్రస్తుతం తాము ఉన్న చోటు నుండి బయటపడుతూ అధిగమించాల్సియున్న కష్టాలను ఈ ప్రచారోద్యమం కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.

తన బొటనవ్రేలికి గాయమైన తర్వాత తిరిగి రావడంపై ప్రజల అపనమ్మకాలను త్రోసిపుచ్చుతూ, తిరిగివచ్చిన రుతురాజ్ వంటి కొత్తవారి విశిష్ట బలం యొక్క ప్రయాణాన్ని బ్రాండు చరితార్థం చేసింది.వాళ్ళకు సరియైన ఆట స్థలాలకు ప్రాప్యత లేకపోయినప్పటికీ సైతమూ, యశస్వి మరియు ఉమ్రాన్ ప్రతిరోజూ అభ్యాసం చేసుకోవడానికి అది నిరుత్సాహపరచలేదనేది వాస్తవం.

వారు క్రమశిక్షణతో శిక్షణ తీసుకున్నారు, కష్టనష్టాలను ఎదుర్కొన్నారు మరియు సాంప్రదాయకమైన మార్గం కాకుండా వేరొక మార్గం తీసుకొని తమ స్వప్నాలను సాకారం చేసుకున్నారు.అంతేకాక, అవేష్ క్రికెట్ స్టేడియం చేరుకోవడానికి 25 కిలోమీటర్లు సైకిల్ త్రొక్కినా లేదా సాయి కిశోర్ స్థానిక వీధుల్లో ఆడి స్టంప్‌లను వెలిగించడానికి తన సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించినా అది వారికే చెల్లింది.

ఈ ప్రచారోద్యమం ద్వారా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసుకొని, క్రికెట్ యొక్క అతిపెద్ద సాధకులతో పాటుగా ‘స్టామినా స్టార్స్’ ను స్మరించుకోవాలని బూస్ట్ భావిస్తోంది.టెలివిజన్, సోషల్ మరియు డిజిటల్ మీడియా వ్యాప్తంగా నడిచే ఈ 360-డిగ్రీల ప్రచారోద్యమం, మైండ్‌షేర్ చే భావపూర్వక ఇతివృత్తంగా చేయబడింది.

హెచ్‌యుఎల్ యొక్క న్యూట్రిషన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీ క్రిష్ణన్ సుందరం గారు, “ఆశావహులైన క్రీడాకారుల జెండర్ లేదా నేపధ్యముతో నిమిత్తం లేకుండా వారి గళంగా మారడానికి బూస్ట్ ఎల్లప్పుడూ పాటుపడింది.రోజుకు ఆఖరున, గెలవాలంటే ఏదైనా ఇతర క్రీడ వలెనే క్రికెట్ కు కూడా కఠోర శ్రమ, పట్టుదల మరియు పటుత్వం అవసరమవుతుంది.

ఈ ప్రచారోద్యమంతో, ఈ ఆటలో కంటికి కనిపించేదానికంటే ఇంకా ఎంతో ఉందని మేము ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాము” అన్నారు.

మైండ్‌షేర్ కంటెంట్+ మరియు భాగస్వామ్యాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అజయ్ మెహతా గారు మాట్లాడుతూ – “ఇండియాలో క్రికెట్‌లో కొందరు సుపరిచితులైన ప్రతిభావంతుల కొరకు ఐపిఎల్ ఒక ఉత్పాదనా క్షేత్రంగా ఉంటూ వస్తోంది.

అగ్రశ్రేణి క్రికెట్ క్రీడాకారులు తమ సత్తువ గాథలను సజీవంగా ముందుకు తీసుకురావడానికి బూస్ట్ ఎల్లప్పుడూ వారితోనే సహవాసం చేసి ఉండగా, ఈ సంవత్సరం మేము యువ క్రీడాకారుల నేపధ్యాలు లేదా వారు ఎక్కడినుండి వచ్చారనేదానితో నిమిత్తం లేకుండా ఈ పెద్ద వేదికపై వారితో సంబరాలు నిర్వహించుకోవాలనుకున్నాము.ఏదైనా ఒక పిచ్ లాగానే, ఒకసారి మీరు మైదానంలో ఉన్నారంటే, అందుకు బలమే ముఖ్యమనే విషయాన్ని మేము నెలకొల్పాలనుకున్నాము.

అన్ని సినిమాలూ తమ పట్టుదల, సంకల్పం మరియు సత్తువ యొక్క వెనుకటి గాధలను సజీవంగా తీసుకువస్తాయి!” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube