వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం..?!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోం సృష్టిస్తుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతున్నాయి.

 Booking Covid Vaccination Appointment Through Whats App Is A Fake News , Whats A-TeluguStop.com

దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కరోనా బారి నుండి ప్రజలను రక్షించుకుందుకు లాక్ డౌన్ విధించారు.దేశంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుంది.

ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కోవిడ్ నియమాలు పాటించాలన్నారు.ఇక ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు ప్రతిఒక్కరు సామజిక దూరం పాటిస్తూ.

మాస్కులు ధరించి శానిటైజర్ ని ఉపయోగించాలన్నారు.

దేశంలో ఒక్కవైపు కరోనా వ్యాక్సిన్ ని ప్రజలకు అందజేస్తున్నారు.

మరోవైపు కేసులు పెరగడం గమన్హారం అనే చెప్పాలి.ఇక తాజాగా కోవిడ్ 19 వాక్సినేషన్ అపాయింట్మెంట్ వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ వార్త నిజమేనా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది.అయితే ఆ వార్త ఎంత వరకు వాస్తవమో ఒక్కసారి చూద్దామా.

అయితే వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని ఒక ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

Telugu Corona Wave, Corona, Covid Vaccine, Covidvaccine, Covin, Whats App-Latest

అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అనే విషయానికి వస్తే.ఇది ఫేక్ న్యూస్ అని అధికారులు చెప్పారు.కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు లేదు.

కేవలం దానిని కోవిన్ మరియు ఆరోగ్య సేతు అప్ లో మాత్రమే బుక్ చేసుకోవడానికి అవుతుంది.వాట్సాప్ ద్వారా వచ్చిన పోస్టులు నిజం కాదు.కేవలం కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారానే అవుతుంది.వాట్సప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube