హైదరాబాద్‌లో మే 26 నుంచి మే 29 వరకూ బుక్ చోర్ యొక్క లాక్ ద బాక్స్ రీలోడెడ్

వినూత్నమైన లిటరరీ కార్యక్రమంఓ బాక్స్‌లో పట్టే అన్ని పుస్తకాలనూ కొనుగోలు చేసే అవకాశం ఇది అందిస్తుంది హైదరాబాద్ మే 2022 ః ప్రీ ఓన్డ్ బుక్స్ కోసం ఆన్‌లైన్ బుక్‌స్టోర్ బుక్ చోర్ వినూత్నమైన బుక్ సేల్‌ను లాక్బాక్స్ రీలోడెడ్ శీర్షికన నిర్వహిస్తుంది.దీనిలో భాగంగా ప్రతి పుస్తకానికీ ధర చెల్లించనవసరం లేకుండా బాక్స్‌కు ధర చెల్లిస్తే, ఆ బాక్స్‌లో పట్టినన్ని పుస్తకాలను వెంట తీసుకువెళ్లవచ్చు.

 Bookchor’s ‘lockthe Box Reloaded’ From 26th May To 29th May In Hyderabad , Bookchor , Hyderabad, Vidyut Sharma, Founder, Bookchor,-TeluguStop.com

ఇది శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమం ట్రస్ట్ వద్ద మే 26 నుంచి మే 29వరకూ జరుగనుంది.ఈ కార్యక్రమంలో 10 లక్షలకు పైగా పుస్తకాలు ఎంచుకునేందుకు అందుబాటులో ఉంటాయి.

వీటిలో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, క్రైమ్, రొమాన్స్, యువత కోసం పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, ఎడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ వంటివి ఉన్నాయి.

పుస్తకప్రేమికులు మూడు విభిన్నమైన పరిమాణాల బాక్సుల నుంచి ఎంచుకోవచ్చు.

వాటిలో ఓడిస్సీ బాక్స్ (ధర 1199 రూపాయలు), పర్శియస్ బాక్స్ (1799 రూపాయలు), హెర్క్యులస్ బాక్స్ (2999 రూపాయలు) ఉంటాయి.ఈ కార్యక్రమం గురించి బుక్‌చోర్ ఫౌండర్ విద్యుత్ శర్మ మాట్లాడుతూ ” హైదరాబాద్‌లో లాక్బాక్స్ రీలోడెడ్ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము.

ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతా, పూనె, ఇండోర్ లాంటి నగరాలలో వచ్చిన స్పందన పట్ల మేము ఆనందంగా ఉన్నాం.పుస్తక ప్రేమికులు దాదాపు 10 లక్షల పుస్తకాల నుంచి ఎంచుకోవచ్చు” అనిఅన్నారు

.

Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube