ట్రంప్ పై విమర్శలు...అవార్డ్ తెచ్చిపెట్టాయి..!!!  

Book On Trump Gives Best Critics Award-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఆయనపై రోజు వారీ విమర్శలు రావడం సర్వ సాధారణం.అయితే రొటీన్ కి భిన్నంగా ఒక జర్నలిస్ట్ విమర్శలు అన్నీ పోగేసి ఓ పుస్తకాన్ని ప్రచురించాడు..

ట్రంప్ పై విమర్శలు...అవార్డ్ తెచ్చిపెట్టాయి..!!!-Book On Trump Gives Best Critics Award

దాంతో అతడి టాలెంట్ కి అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. ఆ వివరాలలోకి వెళ్తే.అమెరికా ప్రభుత్వ పని తీరు పై అమెరికన్ల అనుభవాలని పరిశీలించి, సోధించి విశ్లేషించి విమర్శనాత్మక కథనాలు ప్రచురించినందుకు గాను పెరూ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుల కార్లోస్‌ లొజాదాకు “పులిట్జర్‌” ఉత్తమ విమర్శకుడి అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహక కమిటి తెలిపింది.వినూత్న రీతిలో ఈ విమర్శలను చేసినందుకు గాను లోజాదాకు ఈ అవార్డు అతడిని వరించింది. అయితే ఈ కేటగిరీలో అవార్డు కోసం ది న్యూయార్క్ పత్రికకు చెందిన జిల్‌ లెపోర్‌, న్యూయార్క్‌ టైమ్స్ కి చెందిన మనోహ్లా డార్గిస్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తరుపున లొజాదా గత ఏడాది పోటీ పడగా ఇందులో లొజాదా గెలుపొందారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.