ఇంటి వద్ద నుంచే ఐపీఎల్ టికెట్లు బుక్ చేయండిలా...

ఈసారి ఐపీఎల్ లీగ్‌ను ముంబై, పుణే నగరాల్లోనే నిర్వహిస్తున్నారు.ఫైనల్‌, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు తప్ప ఐపీఎల్ 2022 మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, ఎంసీఏ స్టేడియం లలో జరగనున్నాయి.

 Book Ipl Tickets From Home  ,  Ipl , Tickets , Booking ,sports Updates , Mumbai-TeluguStop.com

ఫైనల్‌, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మాత్రం అహ్మదాబాద్ లో జరపనున్నారు.రేపటి నుంచి అంటే మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లకు 25% ఆడియన్స్ ను అనుమతించనున్నారు.ఈ నేపథ్యంలో టికెట్లను ఇంటి వద్ద నుంచే ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ టికెట్లు బుధవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చాయి.టికెట్లను బుక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ www.iplt20.com లోకి వెళ్లి బయ్ టికెట్స్ (Buy Tickets) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత లాగిన్ అయి మీకు కావాల్సిన టికెట్లను సెలెక్ట్ చేసుకోవాలి.టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లోనే పే చేయాలి.

అనంతరం టికెట్స్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దానిని క్రికెట్ గ్రౌండ్ కి తీసుకెళ్తే సరిపోతుంది.

Telugu Chennai, Ipl, Ipl Tickets, Kolkata, Latest, Mca Stadium, Mumbai, Pune, Up

ఇక టికెట్ ధరలు విషయానికి వస్తే. వాంఖడే స్టేడియంలో ఒక్కో టికెట్ కి మీరు రూ.2500- రూ.4500 వరకు చెల్లించవలసి ఉంటుంది. బ్ర బౌర్న్ స్టేడియంలో రూ.3000-రూ.3500… డివై పాటిల్ స్టేడియంలో రూ.800-రూ.2500, పుణె ఎంసీఏ స్టేడియంలో రూ.1000-రూ.8000 వరకు టిక్కెట్ ధరలను నిర్ణయించారు.అయితే స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూసే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా రూల్స్ పాటించాలి.అలాగే 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది.రేపే జరగనున్న ఫస్ట్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌, చెన్నైసూపర్ కింగ్స్ పోటీ పడనున్నాయి.ఈ మ్యాచ్ ను తిలకించాలనుకుంటే ఇంటి వద్ద నుంచే మీరు ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube