ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేస్తే అంత డబ్బు : మహిళ ఎంప్లాయిస్‌కు వింత ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ, విమర్శలు

పని చేసే ప్రదేశంలో మహిళలకు వేదింపులు అనేవి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.ముఖ్యంగా కార్పోరేట్‌ కంపెనీల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.

 Bonus For To Wear Skirt In The Office-TeluguStop.com

కంపెనీ యాజమాన్యాలు కొందరు మహిళలను చిన్న చూపు చూడటం, వారిని వాడేసుకుని తక్కువ పే ఇవ్వడం, లేదంటే వారిని శారీరకంగా వాడుకునేందుకు ప్రయత్నించడం చేస్తూ ఉంటారు.

ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేస్తే అంత డబ�

మీటూతో పాటు మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు సాగినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న తరహాలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మహిళలు ఆఫీస్‌లలో జాబ్‌లు చేసుకుంటున్నారు.తాజాగా రష్యాలోని ఒక కంపెనీలో ఆడవారిని మరీ అంగడి బొమ్మ మాదిరిగా చూస్తూ వారి మానసిక పరిస్థితితో ఆడుకునేందుకు కంపెనీ ప్రయత్నించింది.

ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేస్తే అంత డబ�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రష్యాకు చెందిన అల్యూమీనియం కంపెనీ అయిన టాట్‌ ఫ్రూప్‌ యాజమాన్యం వింత ప్రకటన చేసింది.మే 27 నుండి జూన్‌ 30 తారీకు వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు కంపెనీ ఫెమినిటీ మారథాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది.ఈ కార్యక్రమంలో భాగంగా లేడీ ఎంప్లాయిస్‌ తమ స్కర్ట్‌ను మోకాళ్లకు పై వరకు వేసుకుని రావడంతో పాటు, అందంగా మేకప్‌ అయ్యి రావాల్సి ఉంటుంది.

అలా అందంగా తయారయ్యి ఫొటోలు కంపెనీకి వాట్సప్‌ చేయాల్సి ఉంటుంది.కంపెనీ యాజమాన్యం వాటిని చూసి రోజు 105 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది.

ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేస్తే అంత డబ�

కంపెనీలో ఆడ మరియు మగ మద్య ఎలాంటి ఆంతర్యం, సిగ్గు మొహమాటాలు లేకుండా ఉండేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కంపెనీ యాజమాన్యం చెప్పుకొచ్చింది.ఆడవారిని ఎక్స్‌ఫోజ్‌ చేయమని చెప్పి అందుకు తగ్గట్లుగా బోనస్‌ ఇస్తామంటూ చెప్పడంపై మహిళ సంఘాల వారు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కంపెనీకి చెందిన కొందరు మహిళలు ఇందుకు సిద్దమయ్యి ఇప్పటికే ఫొటోలు పంపిస్తే మరి కొందరు మాత్రం మహిళ సంఘాల సూచనలతో ఎక్స్‌ఫోజింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేస్తే అంత డబ�

గతంలో జరిగిన ఒలంపిక్స్‌కు అల్యూమీనియం వస్తువులను అందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఇలాంటి చిల్లర పనితో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube