ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ కు ఛాన్స్..!  

Bonthu RamMohan to get chance in MLC Elections, Bontu Rammohan, a chance, MLC elections,KTR, KCR, Telangana, TRS, Greater Elections - Telugu A Chance, Bonthu Rammohan To Get Chance In Mlc Elections, Bontu Rammohan, Greater Elections, Kcr, Ktr, Mlc Elections, Telangana, Trs

తెలంగాణలో ఎన్నికల సందడి షురూ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది.

TeluguStop.com - Bontu Rammohan Mlc Elections Trs

నగరంలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.నగరం ప్రధాన కేంద్రం కావడంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది.

దీంతో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.ఈ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

TeluguStop.com - ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ కు ఛాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ ప్రభుత్వం ఎవరిని నిలబెడితే గెలుస్తామనే విషయంపై ఈ రోజు(గురువారం) ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.

అభ్యర్థుల ఎంపికలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, అభిప్రాయలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు.కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పట్టభద్రుల కోటాలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో నిలిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో సత్సంబంధాలు, స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉన్న బొంతు రామ్మోహన్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడితే మంచి ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.

ఈరోజు జరిగే సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.దీంతో పాటుగా దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ పనులు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై కూడా మాట్లాడనున్నారు.

#A Chance #Telangana #MLC Elections #BonthuRamMohan #Bontu Rammohan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bontu Rammohan Mlc Elections Trs Related Telugu News,Photos/Pics,Images..