ఏకైక జనసేన ఎమ్మెల్యే పదవి ఊడేనా?  

Bonthu Rajeswarao Case File Against In Rapaka-janasena Mla Rapaka Varaprasadh Rao,rapaka Make A Duplicate Notest Distribution On Ap Assembly Elections

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి దారుణమైన పరాభవం ఎదురైంది.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేయగా రెండు చోట్ల కూడా ఓడిపోయాడు.

Bonthu Rajeswarao Case File Against In Rapaka-janasena Mla Rapaka Varaprasadh Rao,rapaka Make A Duplicate Notest Distribution On Ap Assembly Elections-Bonthu Rajeswarao Case File Against In Rapaka-Janasena Mla Rapaka Varaprasadh Rao Make A Duplicate Notest Distribution On Ap Assembly Elections

పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోవడంతో పాటు పార్టీకి చెందిన ముఖ్యులు పలువురు ఓడిపోయారు.ఈ సమయంలో జనసేన పార్టీ నుండి ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.ఆయనే రాపాక వరప్రసాద్‌ రావు.ఈయన తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు.జనసేన పరువు నిలిపిన రాపాక అసెంబ్లీలో పవన్‌ వాయిస్‌ను వినిపిస్తూ వస్తున్నాడు.ఈయన పార్టీ మారుతాడని ప్రచారం జరిగినా ఆయన మాత్రం తనకు జనసేనలోనే సింగిల్‌ ఎమ్మెల్యేగా ఉండాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

Bonthu Rajeswarao Case File Against In Rapaka-janasena Mla Rapaka Varaprasadh Rao,rapaka Make A Duplicate Notest Distribution On Ap Assembly Elections-Bonthu Rajeswarao Case File Against In Rapaka-Janasena Mla Rapaka Varaprasadh Rao Make A Duplicate Notest Distribution On Ap Assembly Elections

ఈ సమయంలోనే రాపాక ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు వేయించడంతో పాటు రిగ్గింగ్‌కు పాల్పడ్డాడు అంటూ వైకాపా నాయకుడు బొంతు రాజేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించాడు.ఆయన వాదనలు విన్న కోర్టు రాపాకతో పాటు ఎన్నికల అధికారికి నోటీసులు పంపించాడు.

విచారణకు మూడు వారాల గడువు ఇచ్చి పూర్తి వివరాలను తెలియజేయాలంటూ ఆదేశించారు.ఈ కేసులో దోషిగా రాపాక తేలితే ఆయన పదవి పోయే అవకాశం ఉంది.రాజోలులో ఉప ఎన్నికలు జరుగుతాయి.