శ్రీదేవి మరణంపై ఉన్న అనుమానాలపై బోణీ కపూర్‌ సంచలన నిర్ణయం... ఇక మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం     2019-01-09   13:11:53  IST  Ramesh Palla

తెలుగు, తమిళంలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా లేడీ సూపర్‌ స్టార్‌, ది లెజెండ్‌ హీరోయిన్‌ అనిపించుకుని అతిలోక సుందరిగా ఎప్పటికి నిలిచి పోయే ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి మరణంను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Boney Kapoor Sensational Decision On Sridevi Biopic-Jahnavi Sridevi Biopic Death Mystery Viral About

Boney Kapoor Sensational Decision On Sridevi Biopic

ఆమె చనిపోయి నెలలు గడుస్తున్నా కూడా ఆమె జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు. దుబాయిలో శ్రీదేవి మరణంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మరణంపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు బోణీకపూర్‌ సిద్దం అయ్యాడు.

శ్రీదేవి డ్రగ్స్‌ తీసుకుని బాత్‌ రూంలో పడి పోయిందని కొందరు, అక్కడ శ్రీదేవి హత్యకు గురి కాబడినదంటూ మరి కొందరు ఇలా రకరకాలుగా ఊహించుకుంటున్న నేపథ్యంలో బోణీకపూర్‌ తన భార్య లైఫ్‌ ఇస్ట్రీతో సినిమాను తీయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీదేవి ఎలా సినీ రంగంలో అద్బుతంగా రాణించిందని చూపించడంతో పాటు, సినిమాలకు దూరం అయ్యిన విషయాన్ని ముఖ్యంగా ఎలా చనిపోయిందనే విషయాన్ని మాత్రం చాలా క్లీయర్‌గా వివరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోణీ కపూర్‌ స్వయంగా శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించబోతున్నాడట.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న బోణీ, త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ప్రముఖ దర్శకుడి చేతిలో ఈ బయోపిక్‌ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం బోణీ తన టీంతో కలిసి స్క్రిప్ట్‌ను రెడీ చేయిస్తున్నాడు. రెండు నెలల్లో సినిమాను పట్టాలెక్కించి, ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శ్రీదేవి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. రెండు నెలల్లో సినిమాను పట్టాలెక్కించి, ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శ్రీదేవి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.


Boney Kapoor Sensational Decision On Sridevi Biopic-Jahnavi Sridevi Biopic Death Mystery Viral About