ప్రియా ప్రకాష్ కి బోనీ కపూర్ లీగల్ నోటీసులు..! అనుమతి లేకుండా తీసేస్తారా.? బాత్ టబ్ లోని ఆ సీన్.?

కన్నుగీటి కుర్రకారు మతిపోగొట్టింది ప్రియా ప్రకాష్ వారియర్.కేవలం ఒకే ఒక్క పాటతో ప్రపంచ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.

 Boney Kapoor Sends Legal Notice To Priya Prakash Varrier-TeluguStop.com

ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.అది కూడా శ్రీదేవి పాత్రతో వస్తూ షాకిస్తోంది.

ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీదేవి బంగ్లా’ లో శ్రీదేవిగా నటిస్తోంది ప్రియా ప్రకాష్.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సినిమాలో ప్రియా పాత్ర పేరు శ్రీదేవి.ఓ చిన్న పిల్లకి ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సన్నివేశంతో ట్రైలర్‌ మొదలైంది.‘మీకు ఇష్టమైన నటి ఎవరు’ అని ఆ చిన్నారి అడగ్గా.‘నాకు ఇష్టమైన నటి నేనే.

’ అని ప్రియా అంటారు.

ఇందులో ఆమె రీల్‌ లైఫ్ హీరోయిన్‌గా నటించారు.‘ఓ నటిగా నేను చాలా అదృష్టవంతురాలిని.నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు.

పేరు, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చాడు.ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు.

కానీ.’ అన్న డైలాగ్‌‌ వినిపిస్తున్న సమయంలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది.

ఆ తర్వాత ప్రియా ఓ పక్క ఏడుస్తూ మరోపక్క మద్యం తాగుతున్నట్లు కన్పించారు.చివర్లో బాత్‌టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించడంతో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ట్రైలర్ కంటెంట్‌, సినిమాలో పేరు చూసి శ్రీదేవి భ‌ర్త అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు.శ్రీదేవి చ‌నిపోయిన‌ట్లే.ఈ సినిమాలో హీరోయిన్ చ‌నిపోయిన‌ట్లు ట్ర‌యిల‌ర్లో చూపించారు.దాంతో బోనీక‌పూర్ ఈ మూవీ మేక‌ర్స్‌కి లీగ‌ల్ నోటీసులు పంపారు.

ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి.ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్‌ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు.

ఇక ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ ప్రియని ట్రోల్ చేస్తున్నారు.శ్రీదేవి పాత్రలో నటించే అంత సీన్ ప్రియకి లేదు అంటున్నారు.అంతేకాదు తన ఎక్సపోసింగ్ పై కూడా విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్.

మరి ఈ చిత్రంపై మీ కామెంట్ ఏంటి?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube