సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎముకల వ్యాపారం ...!

Bones Business Is Going Viral In Social Media

రండి బాబు రండి అంటూ తాజా తాజా కూరగాయలు అమ్మితే ఎవరైనా సరే కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు.అంతేగానీ.

 Bones Business Is Going Viral In Social Media-TeluguStop.com

‘రండీ బాబూ రండీ మనుషుల పుర్రెలు, ఎముకల కొనుక్కోండి.’ అంటే ఎవరైనా ముందుకు వస్తారా.

అసలా మాట వింటేనే జడుసుకుని వణికిపోరూ.! నిజానికి మనిషి ఎముకలు, పుర్రెలు చూస్తేనే భయం పుడుతుంది.

 Bones Business Is Going Viral In Social Media-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎముకల వ్యాపారం …-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటిది ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తాజా కూరగాయలు అమ్మినట్లు మనిషి అవశేషాలు ప్రతి ఒక్కరికీ అమ్మేస్తున్నాడు.అదేంటి మనిషి ఎముకలేమైన కూరగాయలా అమ్మేయడానికి అని సందేహించకండి! ఎందుకంటే అమెరికాకు చెందిన 21 ఏళ్ల జాన్‌-పిచయా ఫెర్రీ అనే టిక్‌టాకర్‌ నిజంగానే బొక్కల వ్యాపారం చేస్తున్నాడు.

అతనికి టిక్ టాక్ లో 5లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

దీంతో ఎముకల వ్యాపారం ప్రారంభిస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావించాడు.

అనుకున్నదే తడవుగా న్యూయార్క్‌ లో ఏకంగా ఓ కంపెనీ ప్రారంభించి మనుషుల ఎముకలు, పుర్రెలను విక్రయిస్తామంటూ ప్రకటన కూడా ఇచ్చాడు.అంతేకాదు, తన ఫాలోవర్స్ సాయంతో తన వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అయితే ఆ వీడియోలు, ఫొటోల ప్రకటనల్లో మనిషి పుర్రెలు, ఎముకలు అమ్ముతామని పేర్కొనడాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ వీడియోలు దారుణంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అస్సలు నీకు మనిషి ఎముకలు ఎక్కడనుంచి వచ్చాయి? వ్యాపారం కోసం ప్రజలను చంపేస్తున్నావా ఏంటీ? అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.ఇంకొందరు మాత్రం నీకు చేయడానికి ఇంకేం వ్యాపారం దొరకలేదా నాయనా అని తిడుతున్నారు.

అయితే ఈ ఆలోచన కొత్తగా ఉండటంతో అతని వ్యాపారం గురించి మిలియన్ల మందికి తెలిసింది.

Telugu America, American Young Men, Bones Business, Going Viral, Human Bone, Human Skulls, International Business, John, Latest News, New York, Selling, Social Media, Tiktoker, Viral Social-Latest News - Telugu

జాన్‌-పిచయా ఫెర్రీ తన వ్యాపారం కోసం శ్మశానాల నుంచి మనిషి పుర్రెలు, ఎముకలను సేకరిస్తాడు.వాటిని తన కంపెనీలో ప్రదర్శనగా పెడతాడు.తన కంపెనీకి విచ్చేసిన కస్టమర్లకు మానవ ఎముకల నిర్మాణం గురించి వివరిస్తుంటాడు.

ఆ తర్వాత ఆ ఎముకలను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటాడు.తన వ్యాపారం మెరుగ్గా సాగాలని ఓ వెబ్‌సైట్‌ను కూడా స్టార్ట్ చేశాడు.

అయితే అమెరికా దేశంలో మనుషుల ఎముకలు అమ్ముకోవడం అనేది నేరం కాదట.ఎవరైనా సరే అక్కడ ఎముకలు విక్రయించొచ్చట.

దీంతో జాన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్టిస్టులకు, కీళ్ల నిపుణులు, యూనివర్శిటీ నిర్వాహకులకు పుర్రెలను అమ్ముతున్నాడు.

#Human Bone #America #John #York #American Young

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube