రస్ అల్ ఖైమా భయంతోనే సీఎం దేశం వీడడం లేదు అన్న మాజీ ఎమ్మెల్యే  

Bonda Uma Sensational Comments On Ap Cm Jagan - Telugu Ap Cm Jagan Mohan Reddy, Bonda Uma, , Jagan In Delhi Tour, Jagan Investment On Dubai, Run All Kaima

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఏపీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.జగన్ దేశం దాటి బయటకి వెళితే అరెస్ట్ అవుతారు అంతో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bonda Uma Sensational Comments On Ap Cm Jagan - Telugu Ap Cm Mohan Reddy In Delhi Tour Investment Dubai Run All Kaima

గతంలో గాన్ పిక్ కోసం రస్ ఆల్ ఖైమా కొంత మొత్తం ఇచ్చింది, అయితే దానిని తిరిగి చెల్లించకపోవడం తో వారు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అందుకే ఆయన దేశం విడిచి బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు అని ఉమా అన్నారు.

దుబాయ్‌లో పెట్టుబడుల సదస్సు జరిగినా జగన్ అక్కడికి వెళ్లకపోవడానికి కారణం ఇదేనంటూ ఉమా ఆరోపించారు.అంతేకాకుండా ప్రధానిని కూడా దీనికి సంబంధించిన జగన్‌ను, ఇతర ముద్దాయిలను తమకు అప్పగించాలంటూ ఆ(RAK) దేశం కోరిందని ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఇతర దేశాల ఒత్తిడిపై ఆలోచనలో పడిందంటూ ఉమా వ్యాఖ్యానించారు.

ఇటీవల నిమ్మగడ్డ సెర్బియా లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.దానిపై కూడా ఉమా వ్యాఖ్యలు చేశారు.

ఇక నిమ్మ గడ్డ జీవితం సెర్బియా కే అంకితం అంటూ వ్యాఖ్యలు చేశారు.జగన్‌తో సహా ఇతర 13 మంది నిందితులు దేశం దాటి వెళ్తే తప్పకుండా అరెస్ట్ అవుతారని.

ఆ భయంతోనే సీఎం విదేశాలకు వెళ్లడం లేదని తీవ్ర విమర్శలు చేశారు బోండా ఉమా.

ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు భిన్న కధనాలను ప్రచురించాయి.రస్ ఆల్ ఖైమా కారణంగానే కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారు అంటూ సంచలన కధనాలు వెల్లడయ్యాయి.అయితే ఇప్పుడు తాజాగా బోండా ఉమా కూడా రస్ అల్ ఖైమా కారణంగానే దేశం విడిచి సీఎం బయటకు వెళ్లడం లేదు అంటూ ఆరోపణలు చేశారు.

మరి వీటిపై వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

తాజా వార్తలు